Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Hamas War: బందీగా ఉన్న ఓ యువతి వీడియో రిలీజ్ చేసిన హమాస్.. నాటకంలో ఒక భాగమన్న ఇజ్రాయిల్

హమాస్‌ మిలిటరీ విభాగమైన ఇజ్‌ అద్‌-దిన్‌ అల్‌-కస్సామ్‌ బ్రిగేడ్స్‌ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసింది. వీడియోలో 21 ఏళ్ల ఫ్రాన్స్‌-ఇజ్రాయిల్‌ మహిళ మియా షెమ్‌ చేతికి సర్జరీ జరగ్గా.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు. ఆ తర్వాత మియా మాట్లాడింది. తనది గాజా సరిహద్దులోని షోహమ్‌ అనే ప్రాంతమని ప్రస్తుతం గాజా లో ఉన్నట్లు చెప్పింది. అక్టోబరు 7న తను సూపర్‌నోవా మ్యూజిక్‌ పార్టీకి వెళ్లిందని, చేతికి తీవ్ర గాయమై గాజాలో మూడు గంటలపాటు సర్జరీ జరిగిందని తెలిపింది.

Israel Hamas War: బందీగా ఉన్న ఓ యువతి వీడియో రిలీజ్ చేసిన హమాస్.. నాటకంలో ఒక భాగమన్న ఇజ్రాయిల్
Mia Shame Video
Follow us
Surya Kala

|

Updated on: Oct 19, 2023 | 11:13 AM

ఇజ్రాయిల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. గత 10 రోజులుగా ఇరువైపులా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది అమాయకులు చనిపోయారు. హమాస్ వందలాది మందిని బందీలుగా పట్టుకుని గాజా స్ట్రిప్‌లోని రహస్య సొరంగాల్లో దాచిపెట్టిందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉంటేనే  తమ దగ్గర బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. కాగా హమాస్ తాజాగా ఫ్రెంచ్-ఇజ్రాయిల్ పౌరురాలి వీడియోను విడుదల చేసింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

హమాస్‌ చెరలో బందీ గా ఉన్న ఇజ్రాయిల్‌ పౌరురాలికి సంబంధించిన ఓ వీడియో బయటికొచ్చింది. అందులో ఆమె చేతికి తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది. హమాస్‌ మిలిటరీ విభాగమైన ఇజ్‌ అద్‌-దిన్‌ అల్‌-కస్సామ్‌ బ్రిగేడ్స్‌ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసింది. వీడియోలో 21 ఏళ్ల ఫ్రాన్స్‌-ఇజ్రాయిల్‌ మహిళ మియా షెమ్‌ చేతికి సర్జరీ జరగ్గా.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు. ఆ తర్వాత మియా మాట్లాడింది. తనది గాజా సరిహద్దులోని షోహమ్‌ అనే ప్రాంతమని ప్రస్తుతం గాజా లో ఉన్నట్లు చెప్పింది. అక్టోబరు 7న తను సూపర్‌నోవా మ్యూజిక్‌ పార్టీకి వెళ్లిందని, చేతికి తీవ్ర గాయమై గాజాలో మూడు గంటలపాటు సర్జరీ జరిగిందని తెలిపింది. వాళ్లు తనను బాగానే చూసుకుంటున్నారని మందులు ఇస్తున్నారని చెప్పింది. వీలైనంత త్వరగా తనను విడిపించి అమ్మనాన్నల దగ్గరకు తీసుకెళ్లమని మియా ఆ వీడియోలో కోరింది. అయితే తను ఎలా గాయపడిందో మాత్రం మియా చెప్పలేదు.  తన కూతురు వీడియో చూసిన మియా తల్లి కరెన్ షెమ్ తన కూతురిని క్షేమంగా తిరిగి తీసుకురావాలని ఇజ్రాయెల్ ఆర్మీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

వీడియోను హమాస్‌ మిలిటెంట్లు తమ సొంత టెలిగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. మద్దతుదారులు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. దీనిపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ మాట్లాడుతూ, తమను తాము మానవత్వం ఉన్న మనుషులుగా చిత్రీకరించుకునేందుకే హమాస్‌ ఈ వీడియోను విడుదల చేసిందని..  కానీ హమాస్‌ ఓ భయంకరమైన ఉగ్రవాద సంస్థ, అనేక మంది పసిబిడ్డలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులను అపహరించి, పలువురిని హత్య చేసిందని తెలిపింది. మియాతో పాటు హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడిపించేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఐడీఎఫ్‌ తమ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..