Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం శ్రీవారి సేవకులన్న చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..

శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ స్వామివారి కీర్తిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సేవకులు ధన్యులన్నారు. నిస్వార్థ సేవలను కొనసాగించాలని, స్వచ్ఛంద సేవలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు భూమన. భగవంతునికి మా కంటే శ్రీవారి సేవకులుగా మీరే ఎక్కువ సన్నిహితులన్నారు. స్వామి వారికి అందరికంటే ఎక్కువ ప్రీతి పాత్రులు కూడా మీరే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. 

Tirumala: నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం శ్రీవారి సేవకులన్న చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..
Srivari Sevaks
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Oct 19, 2023 | 10:55 AM

వెంకన్న భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనమన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సనాతన హిందూ ధర్మ జ్యోతులుగా శ్రీవారి సేవకులు నిలుస్తున్నారన్నారు భూమన. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులతో తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. 23 ఏళ్ల క్రితం కేవలం 200 మంది సేవకులతో టిటిడి శ్రీవారి సేవను ప్రారంభించిందన్నారుప్రస్తుతం రోజుకు 2000 మందికి తక్కువ కాకుండా సేవ కొనసాగు తోందన్నారు. ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మంది శ్రీవారి సేవకులు తిరుమల, తిరుపతిలో భక్తులకు సేవలందించా రన్నారు.

శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ స్వామివారి కీర్తిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సేవకులు ధన్యులన్నారు. నిస్వార్థ సేవలను కొనసాగించాలని, స్వచ్ఛంద సేవలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు భూమన. భగవంతునికి మా కంటే శ్రీవారి సేవకులుగా మీరే ఎక్కువ సన్నిహితులన్నారు. స్వామి వారికి అందరికంటే ఎక్కువ ప్రీతి పాత్రులు కూడా మీరే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.  పరమాత్మునికి ఎక్కువ సేవ చేసే సేవకులు కూడా శ్రీవారి సేవకులేనన్నారు. ఒక వేళ మా సేవలో స్వార్థం ఉండొచ్చు గానీ, శ్రీవారి సేవకుల సేవలో ఏ స్వార్థం లేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

జీతం, భత్యం లేదన్న

భగవత్ సన్నిధానంలోనే సేవ చేయాలనే భావనతో కాకుండా.. ఇక్కడ ఏది ఇచ్చినా అది భగవంతుని సేవ అనుకునే శ్రీవారి సేవకుల కంటే భగవత్ సేవకులు ఇంకెవరూలేరన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి సేవకులు 15 లక్షల మందికి పైగా సేవకులు ఉండడం సామాన్యమైన విషయం కాదంటూ.. 2003 నుంచి ఎంతో డిమాండ్ తో కూడు కున్న సేవలా శ్రీవారి సేవ మారిందన్నారు. స్వామి వారి సేవలో తరించాలని తపనతో శ్రీవారి సేవకులు ఉన్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..