Telangana: ఎన్నికల పండుగవేళ.. టైలర్లకు పెరిగిన డిమాండ్.. ఇలాంటి ప్రత్యేక దుస్తుల కోసం నేతల క్యూ..!
Hyderabad: ఏది ఏమైతేనేమీ కార్యకర్తలకు భోజనం కావాలి అంతే. ఉదయం నుంచి కష్టపడినందుకు సాయంత్రం డబ్బులు కావాలి, ఆ విధంగా కార్యకర్తలకు ఉపాధితో పాటు భోజనం కూడా దొరకడంతో నాయకుల వెనకాల జెండాలు మోస్తూ జేజేలు కొడుతున్నారు. రాజకీయ నాయకుల కోరికలు నెరవేరుతాయో లేదో కానీ కార్యకర్తలకు మాత్రం పండగే పండగ.
అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయ నాయకులు, కార్యకర్తలందరూ ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా షేర్వానీ, కుర్తా పైజామా దుస్తులను ప్రత్యేకించి ఆర్డర్ ఇచ్చిన మరీ కుట్టించుకుంటున్నారు. నాయకులు ఖరీదైన బట్టలతోపాటు షేర్వానీలు కుట్టించుకునేందుకు ఇష్టపడుతుండటంతో.. టైలర్ల దగ్గర విపరీతంగా గిరాకీ పెరిగిపోతుంది. దీంతో టైలర్లు కూడా కాంట్రాక్ట్ బేస్ మీద బట్టలు కుట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక షేర్వాణి కుట్టాలంటే ఒక్కొక్క టైలర్ దగ్గర ఒక్కొక్క రేటు చెబుతున్నారు.. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని పలు నేతలు ముందుగానే బట్టలు కుట్టించుకుని రెడీగా ఉన్నప్పటికీ, టికెట్ రాకపోవడంతో టైలర్ దగ్గర నుంచి బట్టలు తీసుకునే పరిస్థితి లేదు. పేరు వచ్చినా రాకపోయినా తమ నాయకులతో కలిసి ప్రచారం కోసం ఈ దుస్తులు ధరించి ప్రజల్లోకి వెళ్ళనున్నారు.
కుర్తా పైజామా దానిపై షేర్వానీ వేసుకోవడం హైదరాబాద్ కల్చర్ లో భాగమే. ఒక్కొక్క నాయకుడు, కార్యకర్తలు 20 నుంచి 30 దాకా కుట్టించుకున్నారంటే ఏ స్థాయిలో వీళ్ల ప్రచారం హడావుడి ఉంటుందో ఈ దుస్తులు చూస్తే అర్థమవుతుంది. అందర్ షేర్వాణి బాహర్ పరేషాన్ అన్నట్టు ఈసారి ప్రచారం అన్ని రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తుంది. విపరీతంగా ప్రజలను ఆకర్షించేందుకు కొత్త మేనిఫెస్టో, సాంగ్స్ కావాలి. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది…విదేశీ బ్రాండ్ దుస్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాపారస్తులు చెబుతున్నారు.
మరోవైపు టైలర్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోవడంతో డే అండ్ నైట్ కష్టపడుతున్నామని టైలర్లు చెబుతున్నారు. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఇంత గిరాకీ వస్తుందని మాత్రం చెప్పుకువస్తున్నారు. నాయకుడిని చూసి కార్యకర్తలు, కార్యకర్తలను చూసి ప్రజలు కూడా కుర్తా పైజామా షేర్వానీ కుట్టించుకొని తమ నాయకుడి బాటలోనే నడవడానికి ఉరుకులు పరుగులు తీస్తున్న పరిస్థితి. పలు ప్రాంతాల్లో అయితే కార్యకర్తలకు రెండు పూటలా హైదరాబాద్ ప్రత్యేక వంటకాలతో భోజనాలు కూడా ఆఫర్ చేస్తున్నారు. కొన్ని పార్టీలు నాన్ వెజ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటే, మరొకొన్ని పార్టీలు వెజ్‌కు ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి నెలకొంది.
ఏది ఏమైతేనేమీ కార్యకర్తలకు భోజనం కావాలి అంతే. ఉదయం నుంచి కష్టపడినందుకు సాయంత్రం డబ్బులు కావాలి, ఆ విధంగా కార్యకర్తలకు ఉపాధితో పాటు భోజనం కూడా దొరకడంతో నాయకుల వెనకాల జెండాలు మోస్తూ జేజేలు కొడుతున్నారు. రాజకీయ నాయకుల కోరికలు నెరవేరుతాయో లేదో కానీ కార్యకర్తలకు మాత్రం పండగే పండగ.
తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..