AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భారీ లోడుతో హైదరాబాద్ వస్తున్న లారీ.. అనుమానం వచ్చి ఆపిన పోలీసులు.. కట్ చేస్తే..

Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ మార్గాల్లో రాజకీయ పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఎక్కడికి ఎక్కడ పోలీసులు తనిఖీలు ఉంటుండడంతో డబ్బు మద్యం పంపిణీ కష్టమవుతుంది.. రూటు మార్చిన రాజకీయ పార్టీలు ఈసారి మహిళలను టార్గెట్ గా చేసుకున్నాయి.

Hyderabad: భారీ లోడుతో హైదరాబాద్ వస్తున్న లారీ.. అనుమానం వచ్చి ఆపిన పోలీసులు.. కట్ చేస్తే..
Sarees Seized
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Oct 18, 2023 | 9:46 PM

Share

Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ మార్గాల్లో రాజకీయ పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఎక్కడికి ఎక్కడ పోలీసులు తనిఖీలు ఉంటుండడంతో డబ్బు మద్యం పంపిణీ కష్టమవుతుంది.. రూటు మార్చిన రాజకీయ పార్టీలు ఈసారి మహిళలను టార్గెట్ గా చేసుకున్నాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈసారి బతుకమ్మ చీరలు పంపిణీకి సైతం బ్రేక్ పడింది. దీంతో ఎలాగైనా సరే మహిళలకు చీరలను చేర్చాలనుకున్న నేతలు దొంగ చాటుగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు ఒక లారీని మాట్లాడిన నేతలు.. చీరల స్టాక్ అంతా లారీలో సెట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. ఈ క్రమంలో సరిగ్గా హైదరాబాద్ లోకి లారీ ఎంటర్ కాగానే బాచుపల్లి వద్ద పోలీసులు అడ్డగించారు.

వివరాలు అడగగా.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కు లారీ వెళుతోందని డ్రైవర్‌ సమాచారం ఇచ్చాడు. లారీ ఫుల్ లోడుతో వెళ్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. వెంటనే లారీని చెక్‌ పోస్ట్ వద్ద ఆపేసి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో లారీ నిండా చీరలే కనిపించాయి. అయితే, ఆ చీరల లోడ్ ప్రగతి నగర్లో ఉన్న పంచవటి అపార్ట్మెంట్ కు వెళుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

వెంటనే లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. వరంగల్ నుండి తీసుకువచ్చిన చీరల విలువ సుమారు కోటి రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీతోపాటు చీరలను బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, దీని వెనక ఉన్న నాయకుల పేర్లు మాత్రం తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ