Hyderabad: మహిళా కండక్టర్‌ మరణం వెనుక అసలు కథేంటి..? సంచలన నిజాలు వెలుగులోకి..

Hyderabad: మహిళా కండక్టర్‌ మరణం వెనుక అసలు కథేంటి..? సంచలన నిజాలు వెలుగులోకి..

Anil kumar poka

|

Updated on: Oct 18, 2023 | 9:19 PM

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్ గంజి శ్రీవిద్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. బండ్లగూడ డిపోలో 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కండక్టర్‌గా శ్రీవిద్య పని చేస్తోంది. ఈనెల 12న ఆమె సస్పెన్షన్ గురైంది. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది శ్రీవిద్య. బీపీ మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ శ్రీ విద్య చనిపోయింది.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్ గంజి శ్రీవిద్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. బండ్లగూడ డిపోలో 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కండక్టర్‌గా శ్రీవిద్య పని చేస్తోంది. ఈనెల 12న ఆమె సస్పెన్షన్ గురైంది. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది శ్రీవిద్య. బీపీ మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ శ్రీ విద్య చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎల్బీనగర్‌ పోలీసులు. మరోవైపు బండ్లగూడ ఆర్టీసీ డిపో వద్ద విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు..శ్రీవిద్య చావుకు కారణం డిపోలోని అసిస్టెంట్ మేనేజర్ శాలినీ అని ఆరోపిస్తూ ఆందోళనకి దిగారు..రాఖీ పండుగ రోజు కూడా సెలవు ఇవ్వకుండా ఎక్కువ గంటలు పని చేయించారని, అదేవిధంగా రాత్రి సమయంలో కూడా డ్యూటీలు వేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ డిపో ముందు బైఠాయించారు ఆర్టీసీ కార్మికులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..