Kachidi Fish: ఒక్క చేపతో లక్షాధికారి అయిపోయాడు..! వలకు చిక్కిన 22 కిలోల కచిడీ ఫిష్.
ఏపీలో చేపల సీజన్ మొదలైంది. పులసలు, పండుగప్పలు, కచిడీ చేపలు మత్స్యకారుల పంట పండిస్తున్నాయి. మొన్న యానాంలో ఓ మత్స్యకారుడి వలకు భారీ పండుగప్ప చిక్కితే, నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గోదావరిలో జాలరి వలకు పులస చేప సజీవంగా దొరికింది. చేప చిన్నదే అయినా భారీ ధర పలకడంతో మత్స్యకారులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఓ జాలరి వలలో కచిడీ చేప పడింది.
ఏపీలో చేపల సీజన్ మొదలైంది. పులసలు, పండుగప్పలు, కచిడీ చేపలు మత్స్యకారుల పంట పండిస్తున్నాయి. మొన్న యానాంలో ఓ మత్స్యకారుడి వలకు భారీ పండుగప్ప చిక్కితే, నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గోదావరిలో జాలరి వలకు పులస చేప సజీవంగా దొరికింది. చేప చిన్నదే అయినా భారీ ధర పలకడంతో మత్స్యకారులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఓ జాలరి వలలో కచిడీ చేప పడింది. అది అక్షరాలా 3 లక్షల 20 వేల రూపాయలు ధర పలికింది. అది అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పెంటకోట గ్రామానికి చెందిన చేపల మన్నియ్య అనే మత్స్యకారుడు రోజూలాగే చేపల వేటకు వెళ్లాడు. గంగమ్మ కి మొక్కుకొని సముద్రంలో వల విసిరాడు. వలకు ఏదో చిక్కింది. కాస్త బరువుగా కూడా అనిపించడంతో చిక్కింది చేపా.. ఇంకేదైనానా అని అనుమానం వచ్చింది అయినా సహచర జాలర్లతో కలిసి వలను పైకి లాగారు. అంతే వాళ్ల కళ్లలో వెలుగు.. ఎందుకంటే ఆ వలలో అతిపెద్ద కచిడీ చేప పడింది. గోల్డెన్ ఫిష్‌గా పిలుచుకునే ఆ కచిడీ చేప ఏకంగా 22 కిలోల బరువుంది. ఇంకేముంది వెంటనే చేపను మార్కెట్‌కి తరలించి వేలం పెట్టారు. సూరిమని అనే వ్యక్తి ఈ చేపను 3 లక్షల 20 వేల రూపాయలకు దక్కించుకున్నాడు. దీంతో చేపల మన్నియ్య కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒక్క రోజులోనే ఆ మత్స్యకరుడు లక్షాధికారి అయిపోయాడు. పాయకరావుపేట తీర ప్రాంతంలో మునుపెన్నడూ ఇటువంటి చేప చిక్కలేదంటున్నారు స్థానికులు. సముద్రంలో చాలా అరుదుగా కచ్చిడి చేప దొరుకుతుందంటున్నారు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారని, అందుకే ఈ చేపకు డిమాండ్ ఎక్కువ అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..