Flyover Collapsed: మహారాష్ట్రలో చూస్తుండగానే కుప్పకూలిన ఫ్లైఓర్‌.. వీడియో వైరల్.

Flyover Collapsed: మహారాష్ట్రలో చూస్తుండగానే కుప్పకూలిన ఫ్లైఓర్‌.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Oct 19, 2023 | 4:40 PM

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ కూలిపోయింది. ముంబయి-గోవా హైవే మార్గంలోని రత్నగిరి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్‌కు పగుళ్లు రావడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ముంబయి-గోవా జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని చిప్లణ్‌ నగరంలో

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ కూలిపోయింది. ముంబయి-గోవా హైవే మార్గంలోని రత్నగిరి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్‌కు పగుళ్లు రావడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ముంబయి-గోవా జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని చిప్లణ్‌ నగరంలో ఓ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జికి ఓ చోట పగుళ్లు వచ్చినట్లు అక్టోబరు 16 ఉదయం గుర్తించారు అధికారులు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేసారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో చుట్టుపక్కల రోడ్లపై ఉన్న జనం పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రిడ్జి కుప్పకూలుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..