Crime: టీచర్‌ నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన పదోతరగతి విద్యార్థిని..!

Crime: టీచర్‌ నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన పదోతరగతి విద్యార్థిని..!

Anil kumar poka

|

Updated on: Oct 19, 2023 | 7:22 PM

ఆడపిల్లలను చదువుకోడానికి పాఠశాలకు పంపించాలంటే భయపడే రోజులు దాపురించాయా అంటే అవుననే అనిపిస్తోంది. విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారుణాలకు ఒడిగడుతున్నారు. విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి కామంతో రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు, బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు.

ఆడపిల్లలను చదువుకోడానికి పాఠశాలకు పంపించాలంటే భయపడే రోజులు దాపురించాయా అంటే అవుననే అనిపిస్తోంది. విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారుణాలకు ఒడిగడుతున్నారు. విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి కామంతో రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు, బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకానికి పదోతరగతి చదువుతున్న విద్యార్ధిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కదిరి గ్రామంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెడ్డినాగయ్య అనే ఉపాధ్యాయుడు పదోతరగతి విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తొమ్మిది నెలల క్రితం స్కూలులోని స్టాఫ్ రూమ్ లో నీళ్లు తాగేందుకు వచ్చింది బాలిక. అక్కడ ఒంటరిగా ఉన్న నాగయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడా చెప్పొద్దంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత కూడా అనేకమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. ఆ విషయాన్ని కూడా బాలిక గుర్తించలేదు. తాజాగా కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి కారణం రెడ్డినాగయ్య అని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..