Israel: ఒక్కడి కోసం.. వెయ్యి మందిని విడిచిపెట్టింది.! ఖైదీల పరస్పర మార్పిడి
పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య కొనసాగుతున్న భీకరయుద్ధం పదో రోజు దాటింది. తమ చెరలో 199 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. అయితే ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకోవడం హమాస్‌కు ఇదే తొలిసారి. కానీ, ఈ బందీల వంకతో తమ డిమాండ్లు నెరవేర్చుకోవడం మాత్రం వారికి ఇదే తొలిసారి కాదు. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పటి నుంచి..
పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య కొనసాగుతున్న భీకరయుద్ధం పదో రోజు దాటింది. తమ చెరలో 199 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. అయితే ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకోవడం హమాస్‌కు ఇదే తొలిసారి. కానీ, ఈ బందీల వంకతో తమ డిమాండ్లు నెరవేర్చుకోవడం మాత్రం వారికి ఇదే తొలిసారి కాదు. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పటి నుంచి సంక్షోభాలెన్నింటినో ఎదుర్కొంది. ముఖ్యంగా.. 1955 నుంచి ఇప్పటిదాకా పలు సందర్భాల్లో తమ దేశ పౌరులను విడిపించుకునేందుకు ఖైదీల పరస్పర మార్పిడి చేపడుతోంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. 2011లో జరిగిన ఘటన గురించి.. ఒక్క సైనికుడి కోసం ఏకంగా వెయ్యి మంది ఖైదీల్ని విడిచిపెట్టింది ఇజ్రాయెల్. కార్పొరల్ గిలాద్ షలిత్ వెళ్తున్న ట్యాంక్‌పై దాడి చేసిన హమాస్ సభ్యులు.. అతన్ని బందీగా చేసుకున్నారు. ఐదేళ్ల పాటు హమాస్ చెరలో ఉన్న షలిత్‌ను విడిపించాలని బెంజిమన్ నెతన్యాహు ప్రభుత్వం మీద ప్రజలు ఒత్తిడి చేశారు. దీంతో.. షలిత్‌కి బదులుగా ఏకంగా 1,027 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ విడుదల చేసింది. అందులో 78 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. 1955లో.. నలుగురు సైనిక సిబ్బంది కోసం 40 మంది సిరియా పౌరుల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది 1983లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ ఖైదీల్ని విడిపించుకునేందుకు 4,700 మంది పాలస్తీనా-లెబనీస్ ఖైదీల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అందులో మరణశిక్షలు పడ్డ ఉగ్రవాదులు ఉన్నారు. 1985లో ముగ్గురి కోసం మరో 1,150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. 2004 నుంచి 2008 మధ్య కూడా.. ఖైదీల పరస్సర మార్పిడి జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..