AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఇలా కూడా బరువు తగ్గుతారట… అధ్యయనంలో కీలక విషయాలు..

అదనపు కాఫీ తాగడం వల్ల బరువు పెరగరని, చక్కెర వేసిన కాఫీ తాగడం వల్ల బరువు పెరుగుతున్నారని కనుగొన్నారు పరిశోధకులు. కాఫీని పాలతో కలిపి సేవించినా నష్టం లేదు. కానీ చక్కెర మీ బరువును 0.09 కిలోలు పెంచుతుంది. కెఫిన్ ఒక సహజ ఉద్దీపన. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కెఫీన్ జీవక్రియను వేగవంతం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

కాఫీ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఇలా కూడా బరువు తగ్గుతారట... అధ్యయనంలో కీలక విషయాలు..
Expensive Coffee
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2023 | 7:57 AM

Share

భారతదేశంలో కాఫీ ప్రియుల సంఖ్య చాల ఎక్కువగానే ఉంటుంది.. పొద్దున్నే నిద్ర లేవగానే కప్పు కాఫీ, టీ తాగందే ఏ పని చేయనివారు కూడా ఉంటారు. అయితే, కాఫీని మితంగా తాగితేనే ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు కాఫీపై మరో అధ్యయనం జరిగింది.. కాఫీ ప్రియులకు, రోజూ కాఫీ తాగందే ఉండలేని వారికి ఈ అధ్యయనం ఒక శుభవార్త అందించింది. ప్రస్తుతం మన జీవన విధానం చాలా మారిపోయింది. ఆరోగ్యం పట్ల మనం ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత బరువు కంట్రోల్‌లో ఉంటుంది. శరీరంలో కొలస్ట్రాల్‌, బరువును నియంత్రించడానికి మీరు వివిధ వ్యాయామాలు చేయాలి. ఏదైనా ఆహారం తీసుకునే ముందు, అది బరువు పెంచుతుందా..? లేదా అనేది తెలుసుకోవాలి. కాఫీలో కెఫిన్ ఉండటం వల్ల కాఫీ ఆరోగ్యానికి హానికరం అని చాలా మంది అనుకుంటారు. అయితే తాజాగా ఓ అధ్యయనం ఆసక్తికర విషయం చెప్పింది. మీరు రోజుకు ఒక కప్పు అదనంగా కాఫీ తాగితే, మీరు బరువు పెరగరు. మీరు మీ బరువును నియంత్రించుకోవడానికి అదనంగా కాఫీ తీసుకోవచ్చు. అయితే కొన్ని షరతులు పాటించాలి.

కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతారా?.. అవుననే అంటున్నారు పరిశోధకులు. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారు కాఫీ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అదనంగా కాఫీ తాగుతున్నప్పుడు చక్కెర లేదా క్రీమ్‌ వంటివి వాడరాదు. అదనంగా చక్కెర, క్రీమ్ కలపకుండా అదనంగా కాఫీ తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీ వల్ల బరువు తగ్గుతున్నారని పరిశోధకులు గుర్తించారు. రోజుకు ఒక కప్పు అదనంగా కాఫీ తాగే వారు నాలుగేళ్లలో 0.12 కిలోల బరువు తగ్గే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ కాఫీలో పంచదార కలుపుకుని తాగితే బరువు పెరుగుతారు.

దీని గురించి మూడు పరిశోధనలు జరిగాయి: 1986 నుండి 2010 వరకు, 1991 నుండి 2015 వరకు, పరిశోధకులు ఆరోగ్య అధ్యయనాలు నిర్వహించారు. ఇందులో 2.3 లక్షల మంది నర్సులు పాల్గొన్నారు. 1991 నుండి 2014 వరకు నిర్వహించిన మరో అధ్యయనంలో 50,000 మంది పురుషులు పాల్గొన్నారు. ఆ రెండు పరిశోధనల డేటా ధృవీకరించబడింది. నర్సులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, కాఫీ తాగే నర్సులు ప్రతి నాలుగేళ్లకు 1.2 నుండి 1.7 కిలోల వరకు పెరుగుతారని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

పురుషులను కూడా అదే ప్రశ్న అడిగారు. పరిశోధన ముగింపులో అదనపు కాఫీ తాగడం వల్ల బరువు పెరగరని, చక్కెర వేసిన కాఫీ తాగడం వల్ల బరువు పెరుగుతున్నారని కనుగొన్నారు పరిశోధకులు. కాఫీని పాలతో కలిపి సేవించినా నష్టం లేదు. కానీ చక్కెర మీ బరువును 0.09 కిలోలు పెంచుతుంది. కెఫిన్ ఒక సహజ ఉద్దీపన. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కెఫీన్ జీవక్రియను వేగవంతం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆరు వేరియంట్లతో మార్కెట్‌లోకి టాటా ఎస్‌యూవీ..
ఆరు వేరియంట్లతో మార్కెట్‌లోకి టాటా ఎస్‌యూవీ..
రష్యాలో యూపీ ఇంజినీర్‌ అరెస్ట్.. సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి!
రష్యాలో యూపీ ఇంజినీర్‌ అరెస్ట్.. సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి!
ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? అదృష్టాన్ని మార్చే దిశ !
ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? అదృష్టాన్ని మార్చే దిశ !
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!