Dussehra 2023: దసరాకి ఈ గ్రామాల్లో రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ పూజలు.. రీజన్ ఏమిటంటే..
హిందూ విశ్వాసం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో స్థానిక ప్రజలు దసరా పండుగను జరుపుకోరు ఎందుకంటే వీరికి రావణుడిపై చాలా నమ్మకం . అతన్ని గొప్ప జ్ఞానిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగ దసరా.. లేదా విజయదశమి. ఈ సంవత్సరం 24 అక్టోబర్ 2023న జరుపుకుంటారు. హిందూ మతంలో దసరా పండగ జరుపుకోవడానికి భిన్నమైన కథలు వాడుకలో ఉన్నాయి. ఈ పండుగ రావణుడి లంకపై శ్రీ రాముడు సాధించిన విజయానికి గుర్తుగా.. రావణుని మరణానికి సంబంధించినదిగా నమ్ముతారు. త్రేతాయుగంలో ఆశ్వియుజ శుక్లపక్షం పదవ రోజున రావణుడిని వధించిన రాముడు సీతను అతని బారి నుండి విడిపించాడని నమ్ముతారు. ఈ సంతోషంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో రావణ దహనాన్ని చేపడతారు. అయితే కొన్ని చోట్ల మాత్రం రావణుడి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తారు. రామునికి బదులు రావణుడిపై తమ భక్తిని చాటే ప్రజలు.. ఆ గ్రామం ఎక్కడ ఉందో ఈ రోజు తెలుసుకుందాం.
రావణుడి మరణానికి జోధ్‌పూర్‌లో సంతాపం?
హిందూ విశ్వాసం ప్రకారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మండోర్‌లో లంకాపతి రావణుడు మండోదరిని వివాహం చేసుకున్నాడు. శ్రీమాలి కమ్యూనిటీకి చెందిన గోదా గోత్ర ప్రజలు రావణుడి కళ్యాణ ఊరేగింపులో ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్లలేదని అప్పటి నుంచి ఇక్కడే స్థిరపడినట్లు నమ్ముతారు. ఇక్కడ నివసించే శ్రీమాలి కమ్యూనిటీ ప్రజలు తమను తాము రావణుడి వారసులమని భావిస్తున్నారు. రావణుడు మండోదరిని ఆరాధిస్తారు. అటువంటి పరిస్థితిలో దసరా రోజున రావణ దహనంలో పాల్గొనడానికి బదులు.. ఈ తెగకు చెందిన ప్రజలు రావణాసుర మృతికి సంతాపం తెలుపుతారు.
కర్ణాటకలో రావణుడిని ఎందుకు పూజిస్తారంటే..
కర్నాటకలోని మాండ్య , కోలార్‌లలో, రావణుడి వధను చేయరు. పైగా రావణాసురిడిని పూజిస్తారు. ఎందుకంటే ఇక్కడ నివసించే ప్రజలు రావణుడు గొప్ప శివ భక్తుడు అని .. అందుకే అతన్ని కాల్చకూడదు .. పూజించాలని విశ్వాసం. దసరాకు ఇక్కడ ప్రజలు పూర్తి నియమ నిష్టలతో రావణుడిని పూజిస్తారు.
దసరా జరుపుకోని బిస్రాఖ్ గ్రామం
హిందూ విశ్వాసం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో స్థానిక ప్రజలు దసరా పండుగను జరుపుకోరు ఎందుకంటే వీరికి రావణుడిపై చాలా నమ్మకం . అతన్ని గొప్ప జ్ఞానిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు.
రావణుడి మరణానికి మందసౌర్‌లో సంతాపం
దేశంలోని కొన్ని ప్రాంతాల మాదిరిగానే, మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో కూడా రావణుడిని దహనం చేయడం కంటే పూజిస్తారు. ఎందుకంటే ఇక్కడ నివసించే ప్రజలు ఈ స్థలాన్ని రావణుడి అత్తారిల్లుగా భావిస్తారు. మండోదరి పూర్వీకుల ఇల్లు ఇక్కడే ఉందని స్థానికులు నమ్ముతారు, అందుకే విజయదశమి రోజున రావణాసురిడిని కాల్చడానికి బదులుగా అతని మరణానికి సంతాపం తెలియజేస్తారు.
రావణుడి ఆలయం 150 సంవత్సరాల కంటే ఎక్కువ
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో 150 సంవత్సరాల పురాతన రావణుడి ఆలయం ఉంది, ఇది దసరా రోజున పూజ కోసం మాత్రమే తెరవబడుతుంది. విజయదశమి రోజున స్థానిక ప్రజలు రావణుడిని ఆచారాలతో అలంకరించి పూజిస్తారు. రావణ దహనానికి ముందు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. సంవత్సరానికి ఒకసారి తెరుచుకునే ఆలయంలో రావణుడి పూజలో తామర పువ్వులు సమర్పించే సంప్రదాయం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.