Watch Video: భక్త జనసంద్రంగా ఇంద్రకీలాద్రి.. 70 ఏళ్ల తర్వాత తొలిసారిగా మహా చండీదేవి రూపంలో దుర్గమ్మ
70 ఏళ్ల తరువాత బెజవాడ దుర్గమ్మ తొలిసారిగా చండీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. ఈ వేడుకల్లో ఇదే విశేషం.నిజానికి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదోరోజు అమ్మవారు ప్రతి యేటా.. స్వర్ణకవచ అలంకృత దుర్గాదేవి దర్శనం ఇస్తారు. దుర్గమ్మ సన్నిధిలో నిత్యం చండీ హోమాలు నిర్వహిస్తుంటారు కాబట్టీ ఈసారి చండీదేవి అలంకరణ చేయాలని నిర్ణయించింది వైదిక కమిటీ.
శరన్నవరాత్రి మహోత్సవాలతో ఇంద్రకీలాద్రి భక్తజనసంద్రంగా మారింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారంనాడు దుర్గమ్మ మహా చండీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. ఓ రకంగా ఇది దుర్గమ్మ సన్నిధిలో చండీ సప్తపది. 70 ఏళ్ల తరువాత బెజవాడ దుర్గమ్మ తొలిసారిగా చండీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. ఈ వేడుకల్లో ఇదే విశేషం.
నిజానికి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదోరోజు అమ్మవారు ప్రతి యేటా.. స్వర్ణకవచ అలంకృత దుర్గాదేవి దర్శనం ఇస్తారు. దుర్గమ్మ సన్నిధిలో నిత్యం చండీ హోమాలు నిర్వహిస్తుంటారు కాబట్టీ ఈసారి చండీదేవి అలంకరణ చేయాలని నిర్ణయించింది వైదిక కమిటీ. చండీ దేవిని దర్శించుకుంటే అమ్మవారిని అన్ని రూపాల్లో దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
మహాచండీరూపంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకోవడానికి గురువారంనాడు భక్తులు పోటెత్తారు. అక్టోబర్ 20న శుక్రవారం..పైగా మూలనక్షత్రం. ఇది అమ్మవారి జన్మనక్షత్రం కూడా కావడంతో దుర్గమ్మ సరస్వతి అలంకరణతో భక్తులను అనుగ్రహిస్తారు. విశేషమైన మూలనక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ రేపు అమ్మవారిని దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.