Lunar Eclipse 2023: మరికొద్ది రోజుల్లోనే ఈ యేడాది చివరి చంద్రగ్రహణం.. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..
ఈ రాశి వారు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అంతేకాకుండా సన్నిహిత సంబంధాలలో కూడా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ రాశివారు ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణ సమయంలో స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది. ఈ రాశివారు గ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ పౌర్ణమి తిథికి హిందూమతంలో మరో ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది.
ఈ సారి శరద్ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అక్టోబరు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సారి చంద్రగ్రహణం అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఈ నెల 28వ తేదీన అర్ధరాత్రి 1.06 గంటలకు ప్రారంభమై.. 2.22 గంటల వరకు ఉంటుంది. అంటే సుమారుగా గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉండనుంది. దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని జ్యోతిశాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2023 సంవత్సరంలో భారత్‌లో కనిపించే ఏకైక చంద్రగ్రహణం ఇదే అంటున్నారు. అయితే, గ్రంధాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో రాహువు ప్రభావం పెరుగుతుంది. ఈ సంవత్సరం శరద్ పూర్ణిమ ప్రత్యేకించి ఈ 2 రాశుల వారికి మంచిది కాదంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు.
28వ తేదీ ఉదయం 7:31 గంటలకు చంద్రుడు మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహణ సమయంలో చంద్రుడు మేషరాశిలో ఉంటాడు. మళ్ళీ ఈ రాశి లగ్నంలో రాహువు ఉన్నాడు. చంద్రగ్రహణం సమయంలో ఈ రెండు గ్రహాల కలయిక మేషరాశి వారికి శ్రేయస్కరం కాదు. మేష రాశి వారికి ఈ సమయంలో తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరు పోటీ పరీక్షల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలహాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి.మేషరాశి వారికి మానసిక ఆలోచన పెరుగుతుంది. ఈ రాశి వారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి.
అలాగే, ఈ యేడు చివరి చంద్రగ్రహణం కర్కాటకరాశిని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అనవసర ఆందోళనలు పెరగవచ్చు. మనసులో ద్వేషం రావచ్చు. ఎవరితోనైనా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఈ రాశి వారు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అంతేకాకుండా సన్నిహిత సంబంధాలలో కూడా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ రాశివారు ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణ సమయంలో స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది. కర్కాటక రాశివారు గ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ పౌర్ణమి తిథికి హిందూమతంలో మరో ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ తేదీన లక్ష్మీపూజ జరుగుతుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుని నుండి అమృత వర్షం కురుస్తుందని విశ్వాసం.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..