AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బతుకమ్మ, దసరా పండుగతో షాపింగ్ మాల్స్ లో నెలకొన్న సందడి.. ఆఫర్ల తో పబ్లిక్‌ను ఆకట్టుకుంటున్న వ్యాపారులు

Hyderabad: బతుకమ్మలకు మ్యాచింగ్ ఉండేలా ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు డిజైన్ చేయించుకుంటున్నట్టు చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అయితే కస్టమైజ్డ్ డిజైనర్ డ్రెస్ లకు 5వేల నుండి మొదలు కొని డిజైన్ బట్టి 50వేల వరకు రేట్స్ ఉన్నాయి. ఫెస్టివల్ కలెక్షన్స్ లో సిల్క్స్, బెనారస్ సారీస్, వంటి రకకాల హ్యాండ్ లూమ్స్ కు క్రేజ్ పెరిగింది. లోకల్ గా దొరికే హ్యాండ్ లూమ్స్ తో పాటూ...నార్త్ ఇండియాన్ స్టైల్ డిజైనర్ వేర్ కు సిటి లేడీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Telangana: బతుకమ్మ, దసరా పండుగతో షాపింగ్ మాల్స్ లో నెలకొన్న సందడి.. ఆఫర్ల తో పబ్లిక్‌ను ఆకట్టుకుంటున్న వ్యాపారులు
Dussehra Festival Shopping
Peddaprolu Jyothi
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 20, 2023 | 12:53 PM

Share

హైదరాబాద్, అక్టోబర్20; పండగలు వచ్చాయంటే చాలు లేడీస్.. షాపింగ్ కు ప్రియారిటీ ఇస్తుంటారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో దసర బతుకమ్మ పండుగల షాపింగ్ హడావిడి నెలకొంది. అయితే ఇప్పటి యంగ్ జనరేషన్ అయితే రెగ్యులర్ వేర్ కంటే డిజైనర్ బట్టలను కొనేందుకే ఇష్టపడుతున్నారు. అందరిలో డిఫరెంట్ లుక్ ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నగరంలో డిజైనర్ ఎక్స్ పోలకు క్యూ కడుతున్నారు సిటి పబ్లిక్.

దసర, బతుకమ్మ పండగలకు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. రకరకాల చీరలు, లంగాఓనీలు, చుడిదారస్ కలెక్షన్స్ , కిడ్స్ వేర్, మెన్స్ వేర్ తో అప్ టూ 70శాతం వరకు డిసౌంట్స్ అందిస్తున్నారు. అయితే లేడీస్ మాత్రం తమ లుక్స్ యూనిక్ గా ఉండేలా షాపింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో డిజైనర్ లేడీస్ కలెక్షన్స్ కు డిమాండ్ కనిపిస్తోంది.

ప్రస్తుతం నగరంలో డిజైనర్ షోస్ లో ఆలో ఓవర్ ఇండియా నుండి వచ్చిన డిజైనర్ కలెక్షన్స్ కు ఫిదా అవుతున్నారు అమ్మాయిలు. డిజైనర్ లెహంగాలు, కస్టమైజ్డ్ డ్రెస్ లు, ఇండో వెస్ట్రన్ డ్రెస్ ల సేల్స్ బాగున్నయాంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ముక్యంగా బ్రైట్ కలర్స్ తో కస్టమైజ్ చేసిన హాఫ్ సారీస్, కలర్ ఫుల్ ఎథినిక్ వేర్ కు రెస్పాన్స్ బాగుదంటున్నారు. అయితే షాపింగ్ మాల్స్ లో కొనే కంటే యూనిక్ అండ్ కస్టమైజ్డ్ కలెక్షన్స్ ను ఫెస్టివ్ సీజన్ కు తగ్గట్టుగా రూపొందిస్తున్నమంటున్నారు వ్యాపారులు. బతుకమ్మలకు మ్యాచింగ్ ఉండేలా ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు డిజైన్ చేయించుకుంటున్నట్టు చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అయితే కస్టమైజ్డ్ డిజైనర్ డ్రెస్ లకు 5వేల నుండి మొదలు కొని డిజైన్ బట్టి 50వేల వరకు రేట్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఫెస్టివల్ కలెక్షన్స్ లో సిల్క్స్, బెనారస్ సారీస్, వంటి రకకాల హ్యాండ్ లూమ్స్ కు క్రేజ్ పెరిగింది. లోకల్ గా దొరికే హ్యాండ్ లూమ్స్ తో పాటూ…నార్త్ ఇండియాన్ స్టైల్ డిజైనర్ వేర్ కు సిటి లేడీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవేకాకుండా రకరకాల డిజైనర్ జువెలరీ, హెవీ నెక్లెస్ లకు క్రేజ్ ఉందంటున్నారు వ్యాపారులు. ట్రెడీష్నల్ ఆభరణాలలో గుట్టపూలు, లక్ష్మి దేవీ రూపు కలెక్షన్స్, కుందన్ జువెలరీకి మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు

ఏడాదికోసారి వచ్చే పండుగలు కావడంతో ఖర్చుకు వెనకాడకుండా షాపింగ్ చేస్తున్నారు లేడీస్. ముఖ్యంగా తెలంగాణాలో దసరా, బతుకమ్మ పెద్ద పండుగల కావడంతో ట్రెడీష్నల్ డిజైనర్ వేర్ పై క్రేజ్ చూపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..