AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: పెళ్లిలో స్వీట్ సర్‌ప్రైజ్… వధువు చేసిన పనికి వరుడు ఫిదా

ఈ జంట 11 ఏళ్లుగా ఒకరికొకరు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వీరి బంధం బలహీనపడలేదు. చిన్ననాటి స్నేహం పెళ్లి దశకు చేరుకున్న క్షణంలో ఆ ఇద్దరూ కలిసి చదువుకున్న స్కూల్

Wedding: పెళ్లిలో స్వీట్ సర్‌ప్రైజ్... వధువు చేసిన పనికి వరుడు ఫిదా
Chinese Bride Surprises Gro
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2023 | 9:48 AM

Share

Wedding: ఒకరిని ప్రేమించడం అంటే…వారి అభిరుచులను, ఆలోచనలను గౌరవించడం. ప్రేమించిన వారి ఇష్టాలను తెలుసుకుని.. వాటికి విలువ ఇవ్వాలి. అలా తనకు కాబోయే భర్త, లేదా భార్య ఇష్టాలను తెలుసుకున్న జంట జీవితాలు సంతోషంగా షాపీగా సాగిపోతుంటాయి. అలా ప్రేమించిన పెళ్లి వరకు వచ్చిన ఓ జంటప్రేమకథ విచిత్రంగా ఉంది. వధువు… పెళ్లి మండపంలో ఊహించని విధంగా సర్‌ఫ్రైజ్ చేసింఇ.. జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా తీర్చిదిద్దింది. పెళ్లి రోజంటేనే ప్రత్యేకమైన రోజు.. అలాంటి రోజును వధువు మరింత ప్రత్యేకంగా మలిచింది. చైనాలో జరిగిన ఓ పెళ్లిలో వధూవరుల వివాహ దుస్తులకు సంబంధించిన ఉదంతం ఇది. విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. ఇక్కడ చైనీస్ వధువు.. తను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న వరుడికి ప్రత్యేకమైనది, ఎప్పటికీ గుర్తుండిపోయేలా, వెలకట్టలేని బహుమతి ఇవ్వాలని భావించింది. అందుకోసం.. తను స్కూల్‌ యూనిఫాం ధరించింది. అవును, ఇది చూసిన వరుడు షాక్ అవ్వలేదు.. కానీ భావోద్వేగంతో ఏడవడం ప్రారంభించాడు.

అసలు విషయం ఏమిటంటే..

నివేదిక ప్రకారం, చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో జరిగింది ఈ సంఘటన. బోజౌ అనే ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన వివాహం జరిగింది. అసలు ఈ పెళ్లిలో వధువు అడుగుపెట్టగానే..ఆమె ఎంట్రీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఖరీదైన పెళ్లి దుస్తుల్లో కాకుండా.. తన సెకండరీ స్కూల్ యూనిఫామ్‌తో వచ్చింది. ఇది చూసి వరుడు ఉద్వేగానికి లోనయ్యాడు. వాస్తవానికి, ఇది 11 సంవత్సరాల క్రితం ఈ జంట మొదటిసారి కలుసుకున్న స్కూల్‌ యూనిఫాం.

ఇవి కూడా చదవండి

పెళ్లికి స్కూల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు?

ఈ జంట 11 ఏళ్లుగా ఒకరికొకరు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వీరి బంధం బలహీనపడలేదు. చిన్ననాటి స్నేహం పెళ్లి దశకు చేరుకున్న క్షణంలో ఆ ఇద్దరూ కలిసి చదువుకున్న స్కూల్ యూనిఫామ్‌ను పెళ్లి దుస్తులగా ధరించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.. వధువు లోపలికి రాగానే వరుడు ఆమెను చూసి భావోద్వేగానికి లోనయ్యాడు.. వెంటనే ఆమెను హత్తుకుని ఏడ్చేశాడు. వరుడు మంచి సూట్ వేసుకుని ఉంటే.. వధువు మాత్రం చిన్ననాటి స్కూల్ జెర్సీ, జీన్స్, బ్లాక్ షూస్, హై పోనీ టైల్ లో తొలిసారి చూసిన చిన్న నాటి స్నేహితురాలిగా వస్తుందని ఊహించలేదు. హృదయాన్ని హత్తుకునే ఈ క్షణం ఇంటర్నెట్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొంతమంది వినియోగదారులు చెప్పారు – వివాహ దుస్తుల కంటే స్కూల్‌ యూనిఫాం అనే కాన్సెప్ట్‌ ఎంతో అందమైనది అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్