AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహ్‌ చాయ్‌.. 16 రకాల మసాలాలతో తయారు చేసిన బటర్‌ టీ.. చాయ్‌ వాలాకు ఇంటర్నెట్‌ ఫిదా..!

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది సరదాగా కామెంట్లు చేశారు. ఈ టీలో జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేయాల్సింది అంటూ కొందరు  సూచించారు. ఈ టీని మీరు కూడా అక్కడికి వెళ్లినప్పుడు తప్పక ఒకసారి రుచి చూడండి అంటూ తెలిసిన వారు సూచించారు.

వాహ్‌ చాయ్‌.. 16 రకాల మసాలాలతో తయారు చేసిన బటర్‌ టీ.. చాయ్‌ వాలాకు ఇంటర్నెట్‌ ఫిదా..!
Butter Flavored Chai
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2023 | 7:36 AM

Share

టీ తయారు చేయడం చాలా సులభం. టీ పొడి, పాలు, పంచదార ఉంటే చాలు.. టీ ఈజీగా తయారవుతుంది. అయితే ఈ రోజుల్లో తనకు ఇష్టమైన టీపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు చాలా మంది. టీలో టీ పొడినే కాకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా కలుపుతున్నారు. ఉదయం లేచిన వెంటనే టీ తాగడం మొదలుపెట్టిన భారతీయులకు రాత్రి పడుకునే వరకు టీ అవసరం. ఈ టీ తాగడం వల్ల మీ మూడ్ రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి, ఏ పని చేస్తున్నా.. మధ్య మధ్యలో ఛాయ్‌ బ్రేక్‌ తప్పనిసరిగా తీసుకుంటారు. విసుగు, చిరాకుతో ఉన్న వారు అదే టీని మసాలా దినుసులు కలిపి ప్రత్యేకంగా తయారు చేసుకుని తాగుతారు. అల్లం, తులసి, దాల్చిన చెక్కతో సహా మసాలా దినుసులతో కలిసి తయారు చేసే టీ అదరగొడుతుంది. టీ రుచిని మార్చేందుకు వెన్న కలుపుతున్న టీ తయారీదారులను చూశారా..? అవును, టీ చేయడానికి వెన్నను ఉపయోగిస్తున్నారు.. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

చక్కెర ఆరోగ్యానికి హానికరం కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే బెల్లం టీని తయారుచేస్తారు. అయితే ఈ వ్యక్తి టీలో వెన్న వేస్తున్నాడు… ఆయన టీ తయారుచేసే విధానం కూడా వెరైటీగా ఉంది. అతను టీలో 16 రకాల సుగంధ ద్రవ్యాలు, వెన్న, గులాబీ రేకులు (టీ పెటల్స్) వేశాడు. వీటన్నింటితో పాటు టీపొడి కూడా వేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ వ్యక్తి ఈ స్పెషల్‌ ఛాయ్‌కి దాల్ మఖానీ, చాహా మఖానీ అనే క్యాప్షన్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

బటర్ టీ ఎలా తయారు చేస్తారు? : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఒక వ్యక్తి ముందుగా ఒక గిన్నెలో వెన్నను కరిగించాడు. వెన్న వేడయ్యాక అందులో గులాబీ రేకులను వేయాలి. 16 రకాల మసాలా దినుసులు కూడా కలుపుతారు. చివరగా టీ పొడి, పంచదార, బాదంపప్పు వేయాలి. కొంత సమయం తర్వాత టీ మిశ్రమాన్ని వేడి చేసి, వడకట్టి సర్వ్ చేస్తారు.

ఇది కొత్త టీ పద్ధతి కాదు: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆహారంపై కొత్త ప్రయోగానికి సంబంధించిన వీడియో ఇది. కానీ ఈ టీ రిసిపి కొత్తది కాదు, ఇందులో టీని వెన్నతో కలుపుతారు. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1945లో టీ అమ్మే వ్యక్తి అతని తాత ఈ బటర్‌ టీని ప్రారంభించాడు. అప్పటి నుంచి బటర్ టీ అమ్ముతున్నారని తెలిసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది సరదాగా కామెంట్లు చేశారు. ఈ టీలో జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేయాల్సింది అంటూ కొందరు  సూచించారు. ఈ టీని పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో విక్రయిస్తారని. మీరు కూడా అక్కడికి వెళ్లినప్పుడు తప్పక ఒకసారి రుచి చూడండి అంటూ తెలిసిన వారు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్‌ అప్‌డేట్‌.. రాబోయే 10 రోజుల్లో పరిస్
పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్‌ అప్‌డేట్‌.. రాబోయే 10 రోజుల్లో పరిస్
కిస్మిస్‌ల‌ను ఇలా తిన్నారంటే,మీరు ఊహించని ఎన్నో అద్భుత‌మైన లాభాలు
కిస్మిస్‌ల‌ను ఇలా తిన్నారంటే,మీరు ఊహించని ఎన్నో అద్భుత‌మైన లాభాలు
మీరు తింటున్న చీజ్ అసలైనదేనా..? నకిలీ జున్నును ఇలా గుర్తించండి.
మీరు తింటున్న చీజ్ అసలైనదేనా..? నకిలీ జున్నును ఇలా గుర్తించండి.
ఈ రేగు పంట వేస్తే రైతుకు లాభాల పంటే..
ఈ రేగు పంట వేస్తే రైతుకు లాభాల పంటే..
యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!
యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!
శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్!
ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్!
ఒక కిలో వేరుశనగ గుండ్ల నుంచి ఎంత నూనె వస్తుంది?
ఒక కిలో వేరుశనగ గుండ్ల నుంచి ఎంత నూనె వస్తుంది?
నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..
నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..
లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!
లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!