వామ్మో.. ముసలోడే గానీ.. మహా ముదురు.. హోటల్‌ బిల్‌ ఎగ్గొట్టేందుకు భలే నాటకాలు..

దీనిపై హోటల్‌ సిబ్బంది పలు రెస్టారెంట్లకు నోటీస్‌లు పంపించారు... అతని ప్రవర్తన చాలా నాటకీయంగా ఉందని, అతడు అలసిపోయినట్లు నటించాడు. నేలపై పడి కొట్టుకోవటం ప్రారంభించాడని చెప్పారు. అతన్ని నాటకాన్ని పసిగట్టి తగిన బుద్ధిచెప్పామని అన్నారు. అందుకే అతని ఫోటోలను అన్ని రెస్టారెంట్లకు పంపాము. అతను మళ్లీ ఎలాంటి డ్రామా చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నామని రెస్టారెంట్ మేనేజర్ చెప్పారు.

వామ్మో.. ముసలోడే గానీ.. మహా ముదురు.. హోటల్‌ బిల్‌ ఎగ్గొట్టేందుకు భలే నాటకాలు..
Most Expensive Hotels
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2023 | 1:27 PM

హోటల్‌కి వెళ్లిన తర్వాత జేబులో డబ్బు లేకపోతే, ఎలా ఉంటుంది..? భోజనం చేసిన హోటల్‌ సిబ్బంది బిల్లు అడిగితే.. అప్పుడు పరిస్థితి ఏంటి..? పీకల దాకా తిన్నాక బిల్లు కట్టకుండా తప్పించుకోవడానికి కొందరు రకరకాల డ్రామాలు ఆడుతుంటారు. సినిమాల్లో ఇలాంటి హాస్య సన్నివేశాలు చాలానే చూస్తుంటాం.. జేబులో డబ్బు లేకుండా హోట్‌లో పీకలదాకా తిన్న వ్యక్తి.. మూడు వంతుల భోజనం ముగిశాక జేబులో తెచ్చుకున్న బొద్దింకను ఆ భోజనంలో వేసి నానా హంగామా చేస్తుంటారు. ఇలా కేటుగాళ్లు రకరకాల నాటకాలాడుతూ హోటల్‌ బిల్లు ఎగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, అలాంటిదే చేశాడు ఇక్కడో వృద్ధుడు. నగరంలోని పలు రెస్టారెంట్లలో తన ‘కళ’ను ప్రదర్శించాడు. అయితే, రిల్‌పై జరిగే సీన్‌ని రియల్‌ లైఫ్‌లో చేసి చూపించాడు ఒక కిలాడీ వృద్ధుడు. ఈ సంఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. స్పెయిన్‌లోని బ్లాంకా ప్రాంతంలోని దాదాపు ప్రతి రెస్టారెంట్‌కి 60 ఏళ్ల వృద్ధుడి ఫోటోను షేర్‌ చేశారు. ఈయన వస్తే తిండి పెట్టాలి కానీ లోనికి రానివొద్దని మెసేజ్ కూడా ఇచ్చారు. దీనికి కారణం ఈ కిలాడీ వృద్ధుడు ఆడిన నాటకాలే. హోటళ్లలో పీకలదాకా ఫుడ్డు తింటూ బిల్లు కట్టకుండా తప్పించుకుంటున్నాడు.

హోటళ్లలో విపరీతంగా తిన్నాక బిల్లు కట్టకుండా తప్పించుకోవడానికి సులువైన మార్గం కనిపెట్టాడు సదరు కిలాడీ వృద్ధుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కి పైగా రెస్టారెంట్లను మోసం చేశాడు. చివరకు గత నెలలో ఓ హోటల్ లో 37 డాలర్ల బిల్లు కట్టకుండానే.. ఇలా నటించేందుకు వెళ్లి పట్టుబడ్డాడు. బిల్లును టేబుల్‌పై పెట్టిన హోటల్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతలోనే అతడు మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని చూసిన సిబ్బంది అతడిని అడ్డుకుని బిల్లు చెల్లించాలని కోరారు. హోటల్ రూమ్ నుంచి డబ్బులు తెస్తానని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ సిబ్బంది అంగీకరించలేదు. తన ప్లాన్ విఫలమైందని గ్రహించి, గుండెపోటు వచ్చినట్లు నటించడం ప్రారంభించాడు.

అంబులెన్స్‌కు ఫోన్ చేయమని హోటల్ సిబ్బందికి చెప్పాడు. అయితే, హోటల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిలాడీ వృద్ధుడు ఎవరనేది గుర్తించారు. అలికాంటేలోని ఇతర రెస్టారెంట్లు మోసం చేసి పారిపోయిన వ్యక్తి ఇతడేనని గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టారు.

ఇవి కూడా చదవండి

దీనిపై హోటల్‌ సిబ్బంది పలు రెస్టారెంట్లకు నోటీస్‌లు పంపించారు… అతని ప్రవర్తన చాలా నాటకీయంగా ఉందని, అతడు అలసిపోయినట్లు నటించాడు. నేలపై పడి కొట్టుకోవటం ప్రారంభించాడని చెప్పారు. అతన్ని నాటకాన్ని పసిగట్టి తగిన బుద్ధిచెప్పామని అన్నారు. అందుకే అతని ఫోటోలను అన్ని రెస్టారెంట్లకు పంపాము. అతను మళ్లీ ఎలాంటి డ్రామా చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నామని రెస్టారెంట్ మేనేజర్ చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?