Dasara Festival 2023 : కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ.. రూ. 25,55,555 నోట్లతో..
Mancherial: అమ్మవారిని లక్ష్మీదేవీ రూపంగా కొలుస్తూ భక్తులు పోగుచేసిన నోట్లతో మండపం నిండా నోట్ల కట్టలతో అలంకరించారు. పది రూపాయల నోటు నుంచి 500ల నోటు వరకూ ఈ అలంకరణలో ఉపయోగించారు భక్తులు. తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటి కుంటున్నారు. సాయంత్రం వేళల్లో బతుకమ్మలు, కోలాటాలతో సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
మంచిర్యాల జిల్లా, అక్టోబర్19; మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ భవనంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు మహాలక్ష్మి అవతారంలో భాగంగా అమ్మవారిని 25,55,555 రూపాయల కరెన్సీ నోట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని లక్ష్మీదేవీ రూపంగా కొలుస్తూ భక్తులు పోగుచేసిన నోట్లతో మండపం నిండా నోట్ల కట్టలతో అలంకరించారు. పది రూపాయల నోటు నుంచి 500ల నోటు వరకూ ఈ అలంకరణలో ఉపయోగించారు భక్తులు. నిర్వాహకులు ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని పెంచుతూ కరెన్సీతో అలంకరిస్తు వస్తున్నారు…
తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటి కుంటున్నారు. సాయంత్రం వేళల్లో బతుకమ్మలు, కోలాటాలతో సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి