Viral: కారు ఇంజిన్‌లో వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఊహించని సీన్.!

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే చాలు.. మనందరం దడుసుకుని చస్తాం. కానీ అదే పాము.. లేదా ఇంకా భారీ పైథాన్ మన దగ్గరలో కనిపిస్తే.. ఇంకేమైనా గుండె జారి ప్యాంట్‌లోకి వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో సరీసృపాలు తమ ఆవాసాలను వదిలిసే జనాలున్న ప్రదేశాల్లోకి వస్తున్నాయ్. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో జరిగింది.

Viral: కారు ఇంజిన్‌లో వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఊహించని సీన్.!
Representative
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 19, 2023 | 12:38 PM

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే చాలు.. మనందరం దడుసుకుని చస్తాం. కానీ అదే పాము.. లేదా ఇంకా భారీ పైథాన్ మన దగ్గరలో కనిపిస్తే.. ఇంకేమైనా గుండె జారి ప్యాంట్‌లోకి వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో సరీసృపాలు తమ ఆవాసాలను వదిలిసే జనాలున్న ప్రదేశాల్లోకి వస్తున్నాయ్. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో జరిగింది. ఓ భారీ పైథాన్ సైలెంట్‌గా కారు ఇంజిన్‌లో సేద తీరుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక చిత్తరంజన్ పార్క్‌ వద్ద ఓ వ్యక్తి తన కారును పార్క్ చేసి ఉంచగా.. దాని ఇంజిన్‌లో ఏకంగా ఆరడుగుల పైథాన్ ఎంచక్కా సేద తీరుతూ కనిపించింది. మొదటిగా అతడు వింత శబ్దాలు రావడాన్ని గమనించగా.. అవి ఇంజిన్ నుంచి వస్తున్నాయని.. బోనెట్ తీసి చూడగా.. ఇక అప్పుడు కనిపించిన సీన్‌కు అతడి గుండె ఝల్లుమంది. పైథాన్‌ను చూడగానే అక్కడే స్థానికంగా ఉన్న ఓ ఎన్జీవోకు సమాచారం అందించాడు. సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి.. ఆ పైథాన్‌ను బయటకు తీశారు ఎన్జీఓ సిబ్బంది.

ఇంజిన్ నుంచి ఎలాంటి గాయాలు కాకుండా ఆ కొండచిలువను బయటకు తీసిన వైల్డ్‌లైఫ్ ఎన్‌జీఓ సిబ్బంది.. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీశాఖ అధికారులకు అప్పజెప్పారు. ఆ తర్వాత పైథాన్‌ తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టారు అధికారులు. కాగా, ట్విట్టర్ వేదికగా వైల్డ్‌లైఫ్ ఎన్జీఓ.. ‘పాములు మీ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే.. వాటిని చంపొద్దని.. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని’ కోరింది. అటు ట్విట్టర్‌లో ఈ వీడియో చూసిన నెటిజన్లు నిర్ఘాంతపోతూ.. కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

పైథాన్ రెస్క్యూ వీడియో కింద ట్వీట్‌లో చూడండి..