Dussehra 2023: రావణుడు ప్రతిష్టించిన శివ పార్వతుల ఆలయాలు.. విశిష్టత ఏమిటో తెలుసుకోండి..

రావణుడు తన తప్పును గ్రహించి.. అక్కడ ఉన్న శివయ్యను రావణుడు ప్రతిరోజూ పూజించడం ప్రారంభించాడు. రోజూ 100 కమలాలను సమర్పించేవాడు. ఇలా శివయ్యను మళ్ళీ తన లంకకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నం అనేక సంవత్సరాలు చేశాడు.. రావణాసుడు.. అయితే అతని తపస్సు ఫలించబోతుండగా ఒకరోజు బ్రహ్మ దేవుడు తన 100 తామరపువ్వుల నుండి ఒక పువ్వును తగ్గించాడని పురాణాల కథనం.

Dussehra 2023: రావణుడు ప్రతిష్టించిన శివ పార్వతుల ఆలయాలు.. విశిష్టత ఏమిటో తెలుసుకోండి..
Kamalnath Mahadev Temple
Follow us

|

Updated on: Oct 22, 2023 | 10:16 AM

దేశంలో అనేక అమ్మవారి పుణ్యక్షేత్రాలు, దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. ఇవి ప్రజల విశ్వాసానికి  కేంద్రాలుగా భావిస్తారు. లయకారుడు మహాదేవుని ఆలయాలు కూడా అనేకం ఉన్నాయి. శివయ్యను గుర్తుచేసుకుంటే.. అందరి మదిలో తప్పనిసరిగా లంకాపతి రావణుడి వస్తాడు. రావణుడు శివునికి గొప్ప భక్తుడు. మహాదేవుని నుండి వరం పొందేందుకు రావణాసురుడు అనేక సార్లు కఠోర తపస్సు చేశాడని నమ్ముతారు. లంక రాజు రావణుడి .. శివుడికి ఆరాధించిన శివాలయం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న  పౌరాణిక చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

కమల్నాథ మహాదేవుడి ఆలయం

ఉదయపూర్ సమీపంలోని అవర్‌ఘర్ కొండలపై ఉన్న కమల్‌నాథుడి ఆలయాన్ని లంకాపతి రావణుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. ఒకసారి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు కైలాస పర్వతంపై కఠోర తపస్సు చేశాడు. శివయ్య ఆత్మలింగాన్ని వరం గా పొందాడు. ఆ లింగాన్ని తీసుకుని లంకకు వెళ్లే వరం పొందాడు. అయితే ఆ సమయంలో ఆ శివలింగాన్ని నేలపై ఎక్కడా ఉంచరాదనే ఒక షరతు కూడా పెట్టాడు శివయ్య. దీంతో రావణాసురుడు ఆత్మశివలింగాన్ని తీసుకుని వెళ్తున్న రావణుడు అలసిపోయి..  అతను శివలింగాన్ని ఒక ప్రదేశంలో ఉంచి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత శివలింగాన్ని తీసుకుని వెళ్లడం కోసం శివలింగాన్ని చేతిలోకి తీసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆ శివలింగం రాలేదు.

అప్పుడు రావణుడు తన తప్పును గ్రహించి.. అక్కడ ఉన్న శివయ్యను రావణుడు ప్రతిరోజూ పూజించడం ప్రారంభించాడు. రోజూ 100 కమలాలను సమర్పించేవాడు. ఇలా శివయ్యను మళ్ళీ తన లంకకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నం అనేక సంవత్సరాలు చేశాడు.. రావణాసుడు.. అయితే అతని తపస్సు ఫలించబోతుండగా ఒకరోజు బ్రహ్మ దేవుడు తన 100 తామరపువ్వుల నుండి ఒక పువ్వును తగ్గించాడని పురాణాల కథనం. అలా 100 తామర పువ్వుల్లో ఒక పువ్వు తగ్గినందున రావణుడు పూజలో 100వ పువ్వుగా తన తలను సమర్పించాడు. రావణాసుడి భక్తికి సంతోషించిన మహాదేవుడు.. రావణాసుడి నాభిలో అమృత కుండని వరంగా ఇచ్చాడని.. అప్పటి నుంచి ఎక్కడ శివయ్య ను కమలనాథ మహాదేవ అని పిలుస్తారని కథనం.

ఇవి కూడా చదవండి

బైద్యనాథ్ ధామ్, డియోఘర్

హిందూ విశ్వాసం ప్రకారం దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ఆలయం కూడా రావణుడితో ముడిపడి ఉంది. దీని కథ కూడా కమల్‌నాథ మహాదేవుడి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని తీసుకురావడానికి రావణుడు చాలా ప్రయత్నించాడని నమ్ముతారు, అయితే అతను విఫలమైనప్పుడు.. కోపంతో ఈ శివలింగాన్ని భూమిలోపల పాతిపెట్టాడు. బాబా వైద్యనాథుడు  పై భాగం చిన్నగా కనిపించడానికి ఇదే కారణం.

రావణుడు స్థాపించిన అమ్మవారి ఆలయం

శ్రీలంకలోని త్రికోణమాలి అనే ప్రదేశంలో శంకరీ దేవి ఆలయం ఉంది. ఇది శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం సతీదేవి చీలమండలు అంటే కాలిగజ్జెలు ఈ ప్రదేశంలో పడ్డాయని నమ్మకం. రావణుడు స్వయంగా ఈ ఆలయంలో ఈ దేవతను ప్రతిష్టించాడని విశ్వాసం. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారి ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు.

మండోదరి పూజించే మహాదేవుని ఆలయం

రావణుడు మాత్రమే కాదు అతని భార్య మండోదరి కూడా మహాదేవునికి గొప్ప భక్తురాలు. రావణుడి వంటి జ్ఞానవంతుడు.. శక్తిమంతమైన భర్తను పొందాలని మండోదరి అనేక ఏళ్లు తపస్సు చేసింది. మండోదరి  తపస్సు చేసిన మహాదేవుడి ఆలయం ప్రస్తుతం మీరట్‌లో బిల్వేశ్వర నాథుడి మహాదేవుడి పేరిట ఉందని నమ్ముతారు. ఈ ఆలయంలో శివుడిని పూజించడం ద్వారా కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తారని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.