AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saddula Bathukamma: నేడే సద్దుల బతుకమ్మ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. ఆంక్షలతో కూడిన ఏర్పాట్లు

ప్రతి ఏటా అమావాస్యరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమయ్యే బతుకమ్మ వేడుకలు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలతో ముగుస్తాయి. సద్దుల సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించి బతుకమ్మను నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈసారి కూడా సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు 14వ తేదీన ఆరంభమైన బతుకమ్మ వేడుకలు 22వ తేదీన సద్దుల బతుకమ్మ సంబరాలతో ముగియనున్నాయి.

Saddula Bathukamma: నేడే సద్దుల బతుకమ్మ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. ఆంక్షలతో కూడిన ఏర్పాట్లు
Saddula Bathukamma
G Peddeesh Kumar
| Edited By: Surya Kala|

Updated on: Oct 22, 2023 | 9:36 AM

Share

సద్దుల బతుకమ్మ సంబరాలకు వేళయింది.. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్న ఆడ పడుచులు చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకోనున్నారు. గౌరమ్మ  నిమజ్జనానికి సిద్ధమయ్యారు.. పూలను సేకరించి సద్దుల బతుకమ్మ సంబరాలకు సిద్ధం చేస్తున్నారు.

ప్రతి ఏటా అమావాస్యరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమయ్యే బతుకమ్మ వేడుకలు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలతో ముగుస్తాయి. సద్దుల సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించి బతుకమ్మను నిమజ్జనం చేయడం ఆనవాయితీ.

బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు నిర్వహించుకోవడం తెలంగాణ సాంప్రదాయం.. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవరోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవరోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవరోజు అలిగిన బతుకమ్మ, ఏడవరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించి బతుకమ్మను నిమజ్జనం చేయడమే ఈ ఉత్సవాల ప్రత్యేకత..

ఇవి కూడా చదవండి

ఈసారి కూడా సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు 14వ తేదీన ఆరంభమైన బతుకమ్మ వేడుకలు 22వ తేదీన సద్దుల బతుకమ్మ సంబరాలతో ముగియనున్నాయి..

తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక బతుకమ్మ సంబరాలు .. ఆచార సాప్రదాయాల ప్రకారం ఆడి పాడి బతుకమ్మ ను నిమజ్జనానికి తరలించేందుకు ఆడ పడుచులంతా సిద్ధమైపోయారు.. ఇప్పటికే పూలు సేకరించి బతుకమ్మను సిద్దం చేస్తున్నారు. బంతి, చామంతి, గునుగు, తంగేడు, సీతమ్మ జడ పూలు, కట్ల పూలు, గుమ్మడి పూల తో బతుకమ్మను పేర్చి సద్దుల బతుకమ్మ సంబరాలకు సిద్దం చేస్తున్నారు.

ఈ సారి వర్షాలు సమృద్దిగా పడడంతో పూలు విరివిగా లభిస్తున్నాయి.. బతుకమ్మను నిమజ్జనం చేసే చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. దీంతో సద్దుల బతుకమ్మ సంబరాలు జరిగే చోట ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు..

వరంగల్ ట్రై సిటీ స్ పరిధిలో పది ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేశారు.  ఎన్నికల కోడ్ ఆటంకంగా మారిన నేపథ్యంలో ఎలాంటి రాజకీయ ప్రచారాలు, నేతల ప్రకటనలకు అవకాశం లేకుండా ఆంక్షలు విధించారు. ఉత్సవాలు జరిగే చోట రాజకీయ ప్రసంగాలు చేయవద్దనీ, నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని ఆంక్షలు విధించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..