Navaratri 2023: నవరాత్రుల్లో 8వ రోజు మహా గౌరీ అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం

ఈ రోజున దుర్గాష్టమిగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున దుర్గాదేవి ఎనిమిదవ అవతారమైన మహాగౌరీ దేవిగా అలంకరిస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల్లో, భక్తులు దుర్గాదేవి ఆశీర్వాదం పొందడానికి ఆమె తొమ్మిది అవతారాలను పూజిస్తారు. అష్టమి తిథి అక్టోబర్ 21 రాత్రి 9:53 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 22 ఆదివారం రాత్రి 7:59 గంటలకు ముగుస్తుంది.

Navaratri 2023: నవరాత్రుల్లో 8వ రోజు మహా గౌరీ అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
Mangala Gowri Devi
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2023 | 9:06 AM

శరన్నవరాత్రులు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేడు నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు.. ఈ రోజున మహా అష్టమి అంటారు. మహా అష్టమి, దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. ఇది దేవి నవరాత్రుల్లో..  దుర్గా పూజ ఉత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నేడు నవరాత్రుల్లో అష్టమి తిధి.. ఈ రోజున దుర్గాష్టమిగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున దుర్గాదేవి ఎనిమిదవ అవతారమైన మహాగౌరీ దేవిగా అలంకరిస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల్లో, భక్తులు దుర్గాదేవి ఆశీర్వాదం పొందడానికి ఆమె తొమ్మిది అవతారాలను పూజిస్తారు.

హిందూ పురాణాల ప్రకారం మహాగౌరి కఠినమైన తపస్సు ద్వారా “గౌర వర్ణాన్ని” పొందింది. అందుకే అమ్మవారు మహా గౌరీ దేవిగా ప్రసిద్ధిగాంచింది. ‘మహాగౌరి’ అంటే అత్యంత ప్రకాశవంతమైనది అని అర్థం. మహా గౌరికి ఎద్దు వాహనం. ఈ రోజున భక్తులు కన్యా పూజ లేదా కుమారి పూజను చేస్తారు. బాలికలను కన్య పూజ కోసం ఆహ్వానిస్తారు. వారిని దేవికి ప్రతి రూపాలుగా భావించి పూజిస్తారు. దుర్గా దేవిని పూజించే వారు ఈ రోజు దుర్గాష్టమిగా జరుపుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ రోజున కన్య పూజను పెళ్లికాని యువతులు చేస్తారు. కన్య పూజ చేసిన బాలికలను పూజించి వారికీ తగిన బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు. బాలికల పాదాలను కడిగి.. ఎరుపు దుస్తులు, గాజులు వంటి ఇతర వస్తువులను సమర్పిస్తారు. ఆ బాలిక నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

అష్టమి కన్య పూజ శుభ ముహూర్తం

అష్టమి తిథి అక్టోబర్ 21 రాత్రి 9:53 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 22 ఆదివారం రాత్రి 7:59 గంటలకు ముగుస్తుంది. శుభ ముహూర్తం: 7:51 ఉదయం నుండి 10:41 ఉదయం వరకూ ఉంటుంది. మళ్ళీ 1:30 మద్యాహ్నం నుంచి 2:55PM వరకు.

మహాగౌరీ దేవి ఎవరంటే..?

హిందూ పురాణాల ప్రకారం.. శైలపుత్రి దేవి పదహారేళ్ల వయసులో చాలా అందంగా మంచి రంగుతో ఉంటుంది. అందువల్ల ఆమె సొగసైన చర్మం కారణంగా మహాగౌరీ దేవి అని పేరు వచ్చింది. మహాగౌరి అనే పేరుకు ధవళ వర్ణం అని అర్థం. మహా అంటే అతి .. గౌరీ అంటే తెలుపు. మహా గౌరీ అవతారం వెనుక ఉన్న కథ ఏమిటంటే.. కాళికా దేవి రక్త బీజుడిని చంపి.. శాంతించి.. పార్వతిగా మారిన తర్వాత కూడా ఆమె నల్లటి చర్మాన్ని కలిగి ఉంది. మహా గౌరీ దేవికి ఎద్దు వాహనం.. అందుకే ఆమెను వృషారూఢ అని పిలుస్తారు. నాలుగు చేతులు కలిగిన దేవి ఒక కుడి చేతిలో  త్రిశూలం ఉంటుంది. మరొక చేయి అభయ ముద్రలో ఉంటుంది. ఒక ఎడమ చేతిలో డమరుని పట్టుకుని మరొకటి వరద ముద్రలో ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంది.

నవరాత్రి 8వ రోజు మంగళ గౌరీ పూజ సమయంలో  ఏ రంగును ధరించాలంటే..

ఉదా రంగు మంగళ గౌరీ దేవికి ఇష్టమైన రంగు..పర్పుల్ రంగు జ్ఞానం, సృజనాత్మకత, రాయల్టీ, శక్తి, ఆశయం,  విలాసం వంటి వివిధ అర్థాలను కలిగి ఉంది. అంతేకాదు సంపద, ఐశ్వర్యానికి సూచన పర్పుల్ రంగు.

నవరాత్రి 8వ రోజున సమర్పించాల్సిన రంగు..

అమ్మవారికి కొబ్బరికాయను సమర్పిస్తారు. అష్టమి రోజున బ్రాహ్మణులకు కొబ్బరికాయలు దానం చేయడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.

 పూజ చేయాల్సిన విధానం

ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన తెల్లని దుస్తులు ధరించాలి. పూజా ప్రదేశంలో పీఠాన్ని ఏర్పాటు చేసి మహాగౌరీ దేవి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచండి.  అమ్మవారి విగ్రహానికి చందనం, కుంకుమని దిద్దండి.  స్వచ్ఛత, భక్తికి చిహ్నంగా దేవతకు తాజా పుష్పాలను సమర్పించండి. నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి. పండ్లు, స్వీట్లు, పాలు దేవతకు ప్రసాదంగా మహా గౌరికి సమర్పించండి. అనంతరం మహాగౌరీ దేవికి సంబంధించిన మంత్రాలు, కీర్తనలను పఠించండి. “ఓం దేవి మహాగౌర్యాయై నమః.” మంత్రాన్ని పఠించండి. అనంతరం హారతిని ఇచ్చి ధ్యానం చేయండి. పూజ తర్వాత మహా గౌరికి నైవేద్యం పెట్టిన  ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచండి.

ధ్యాన శ్లోకం

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|

మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.