AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri: శ్రీశైలంలో కాళరాత్రి అలంకారంలో అమ్మవారు.. నేడు మహాగౌరి అలంకారంలో దర్శనం..

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు.. ఈ రోజు భ్రమరాంబ అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు.  శ్రీ స్వామివారు అమ్మవారితో కలిసి వివిధ వాహనాలపై క్షేత్రపురవీధుల్లో నందివాహనంపై  గ్రామోత్సవం  నిర్వహించనున్నారు. మరోవైపు నవరాత్రుల్లో ఏడవ రోజు శ్రీ భ్రమరాంబికా దేవి కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Navaratri: శ్రీశైలంలో కాళరాత్రి అలంకారంలో అమ్మవారు.. నేడు మహాగౌరి అలంకారంలో దర్శనం..
Srisailam Dasara
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Oct 22, 2023 | 6:46 AM

Share

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు.. ఈ రోజు భ్రమరాంబ అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు.  శ్రీ స్వామివారు అమ్మవారితో కలిసి వివిధ వాహనాలపై క్షేత్రపురవీధుల్లో నందివాహనంపై  గ్రామోత్సవం  నిర్వహించనున్నారు. మరోవైపు నవరాత్రుల్లో ఏడవ రోజు శ్రీ భ్రమరాంబికా దేవి కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కాళరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించారు.  బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించారు. మంగళ హారతులిచ్చారు.

శ్రీ భ్రమరాంబికాదేవి కాళరాత్రి అలంకారంలో మల్లికార్జునస్వామి అమ్మవారు గజవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కర్పూరహారతులిచ్చరు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు నిర్వహించిన కోలాటాలు చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించారు. గ్రామోత్సవం కదలివస్తున్న శ్రీస్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు పలువురు ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సెలబ్రిటీల విడాకుల వెనుక అసలు రహస్యం ఇదేనా?..
సెలబ్రిటీల విడాకుల వెనుక అసలు రహస్యం ఇదేనా?..
కామ దహనం తర్వాత బూడిద ఇంటికి తెచ్చుకోవడం శుభమా..? అశుభమా..?
కామ దహనం తర్వాత బూడిద ఇంటికి తెచ్చుకోవడం శుభమా..? అశుభమా..?
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?
భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో