Vijayadashami: శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం.. విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

విజయదశమిలో జరుపుకునే శమీ పూజకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. శ్రవణా నక్షత్రం ఈ రోజు అంటే  ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది. మంగళవారం రోజున ధనిష్ట నక్షత్రం వస్తుంది. ఈ ధనిష్ట నక్షత్రంలో విజయదశమి పండుగ జరుపుకోవడం శాస్త్ర విరుద్ధమని వైదీకులు అంటున్నారు. 

Vijayadashami: శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం.. విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?
Vijayadasami 2023
Follow us

|

Updated on: Oct 22, 2023 | 7:26 AM

గత రెండేళ్లుగా హిందువుల పండగలు జరుపుకోవడంలో గందరగోళం నెలకొంటుంది. పండగ తిధులు రెండు రోజులుగా రావడంతో ఈ తికమక పెడుతోంది. రాఖీ, వినాయక చవితి వాటి పండగలు మాత్రమే కాదు.. ఇప్పుడు హిందువుల అతి పెద్ద పండగల్లో ఒకటైన దసరా పండగ విషయంలో కూడా అయోమయం నెలకొంది. ఈ సంవత్సరం కూడా విజయాదశమి ఏ రోజున జరుపుకోవాలని విషయంలో గందరగోళం నెలకొంది. కొందరు ఈ నెల 23వ తేదీ సోమవారం జరుపుకోవాలా.. లేదా అక్టోబర్ 24వ తేదీ మంగళవారం జరుపుకోవాలా అనే విషయం పై అయోమయం నెలకొంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన నిర్ణయం సింధు, ధర్మ సింధు ప్రకారం విజయదశమి 23వ తేదీ సోమవారం జరుపుకోవాలని పేర్కొంది. విజయదశమి పండగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై గందరగోళ పరిస్థితులకు తెరదించేందుకు ప్రయత్నం చేశారు.

విజయదశమి పండుగను హిందువులు దశమితో కూడిన శ్రవణా నక్షత్రంలో జరుపుకుంటారు. ఈ శ్రవణా నక్షత్రం ఉన్న సమయంలోనే శమీ పూజను జరుపుతారు. నవరాత్రుల అనంతరం.. పదవ రోజున జరుపుకునే విజయదశమిలో జరుపుకునే శమీ పూజకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. శ్రవణా నక్షత్రం ఈ రోజు అంటే  ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది. మంగళవారం రోజున ధనిష్ట నక్షత్రం వస్తుంది. ఈ ధనిష్ట నక్షత్రంలో విజయదశమి పండుగ జరుపుకోవడం శాస్త్ర విరుద్ధమని వైదీకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం రోజున అపరాహ్ణ ముహూర్తంలో దశమి పగలు గం.2:29 ని. వరకు ఉంది. అపరాహ్ణ కాలము పగలు గం.1:00 నుండి మధ్యాహ్నం గం.3: 28 వరకు ఉంటుంది. ఈ సమయంలో శ్రవణా నక్షత్రంలో  దశమి కలిస్తే అది విజయదశమి అవుతుంది. కనుక దశమి.. శ్రవణ నక్షత్రం కలిసి 23వ తేదీ సోమవారం  దసరా పండుగ శమీ పూజ జరుపుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు శృంగేరి పీఠంలో విజయదశమి శమీపూజ సోమవారం నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు దేవస్థానాల్లో 23 వ తేదీన జరుపుకోవాలని చెబుతున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమిని జరపనున్నారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 వ తేదీ సోమవారం రోజున దసరా పండగను చేయనున్నారు. పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించారు. దీంతో రేపే దసరా పండగ జరుపుకోవాలని.. శమీ పూజను జరుపుకోవాలని పండితులు వెల్లడించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!