AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండిక్కి TSRTC బస్సుల్లో ప్రయాణించేవారికి బంపరాఫర్.. భారీగా నగదు బహుమతి

దసరా పండుగకు టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఈ లక్కీ డ్రా నిర్వహించనుంది. దసరా, బతుకమ్మ పండుగలకు సొంతూర్లకు వెళ్లే వారికి లక్కీ ఆఫర్ ను ప్రకటించింది టీఎస్ ఆర్టీసీ. దాదాపు 11 లక్షల నగదు బహుమతులను ప్రయాణికులకు అందించనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

పండిక్కి TSRTC బస్సుల్లో ప్రయాణించేవారికి బంపరాఫర్.. భారీగా నగదు బహుమతి
TSRTC
Peddaprolu Jyothi
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 22, 2023 | 8:55 AM

Share

దసరా వచ్చిందంటే ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోతుంటాయి. దాంతో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు వందల సంఖ్యలో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తుంటాయి. ఎక్కడెక్కడో స్థిరపడినవాళ్లు, వలస జీవులు విజయదశమికి సొంతూర్లకు పయనమవుతుంటారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో భారీగా రద్దీ కనిపిస్తుంటుంది. ఆర్టీసీ ఆదాయం భారీగా పెంచుకునేందుకు ఈ పండుగ సీజన్ మంచి అవకాశం. ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింతగా ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న చర్యలు తీసుకుంటోంది. దసరా సీజన్ లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి దసరా ధమాకా లక్కీ డ్రా నిర్వహించనుంది.

దసరా పండుగకు టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఈ లక్కీ డ్రా నిర్వహించనుంది. దసరా, బతుకమ్మ పండుగలకు సొంతూర్లకు వెళ్లే వారికి లక్కీ ఆఫర్ ను ప్రకటించింది టీఎస్ ఆర్టీసీ. దాదాపు 11 లక్షల నగదు బహుమతులను ప్రయాణికులకు అందించనున్నారు. ఆర్టీసీ బస్సులో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాల్సి ఉంటుంది. 110 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి రీజియన్ నుంచి 10 మందికి లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశం ఉంటుంది. లక్కీ డ్రా కింద ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.9,900 చొప్పున బహుమతి ఇవ్వనున్నారు.

ఆర్టీసీకి ప్రయాణికులను ఆకర్షించేందుకు దసర ధమాకా ఆఫర్ ను తెచ్చారు. అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు…. అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ లక్కీ డ్రా వర్తిస్తుంది. ఈ దసరా లక్కీ డ్రా ను ప్రయాణికులు ఉపయోగించుకవాలని విగ్నప్తి చేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. పూర్తి వివరాల కోసం 040-69440000, 040-23450033 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

సెప్టెంబర్ లో రాఖీ పండుగ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కు అనూహ్య స్పందన రావడంతో ఈ దసరాకు ధమాకా లక్కీ డ్రా ను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ, దసరా హాలిడేస్ కు సొంత ఊర్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. ఫెస్టివల్ టైమ్ లో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఈనెల 13 నుచిం 24 వరకు 5265 ప్రత్యేక బస్సులను నడపున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..