AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL History: డెబ్యూ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు వీరే.. ఐపీఎల్ హిస్టరీ చూస్తే షాకింకే భయ్యో..

అశ్వని కుమార్ ఈ సంచలన బౌలింగ్‌లో ఇంటర్నెట్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. అయితే, ఒక బౌలర్ ఐపీఎల్ అరంగేట్రంలోనే మొదటి బంతికే వికెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అరంగేట్రంలో తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్లు ఎవరు, ఆ లిస్ట్‌లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

IPL History: డెబ్యూ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు వీరే.. ఐపీఎల్ హిస్టరీ చూస్తే షాకింకే భయ్యో..
Ashwani Kumar Mi Vs Kkr
Follow us
Venkata Chari

|

Updated on: Mar 31, 2025 | 9:07 PM

IPL History: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో, 23 ఏళ్ల అశ్వని కుమార్ తన ఐపీఎల్ అరంగేట్రంచేసిన సంగతి తెలిసిందే. మొదటి బంతికే వికెట్ తీసి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాడు ఈ యంగ్ ప్లేయర్. ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న ఎడమచేతి వాటం సీమర్, మొదటి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను పెవిలియన్ చేర్చాడు. అలాగే ఇప్పటి వరకు 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విని కుమార్ కేవలం 24 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో తన అరంగేట్రం మ్యాచ్‌ని ఎంతో మరపురానిదిగా మార్చుకున్నాడు.

అశ్వని కుమార్ ఈ సంచలన బౌలింగ్‌లో ఇంటర్నెట్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. అయితే, ఒక బౌలర్ ఐపీఎల్ అరంగేట్రంలోనే మొదటి బంతికే వికెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అరంగేట్రంలో తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్లు ఎవరు, ఆ లిస్ట్‌లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ చరిత్రలో డెబ్యూ బాల్‌లోనే ఎంతమంది బౌలర్లు వికెట్ తీసుకున్నారు?

డెబ్యూ బౌలర్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి బంతికే వికెట్ తీయడం ఇది మొదటిసారి కాదు. ఒక బౌలర్ ఈ ఘనత సాధించడం ఇది 10వ సారి. ఇంకా, ఐపీఎల్ చరిత్రలో తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఆటగాడిగా ఇషాంత్ శర్మ నిలిచాడు.

ఇవి కూడా చదవండి

2008లో కేకేఆర్ తరపున ఆడిన ఇషాంగ్ శర్మ ఆర్‌సీబీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌ను అవుట్ చేయడం ద్వారా అతను ఈ ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్ తీసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఓసారి చూద్దాం..

సంవత్సరం బౌలర్ ప్రత్యర్థి మ్యాచ్
2008 ఇషాంత్ శర్మ రాహుల్ ద్రవిడ్ KKR vs RCB
2008 విల్కిన్ సురేష్ రైనా PBKS vs CSK
2009 షేన్ హార్వుడ్ అజార్ బిలాఖియా RR vs DC
2009 అమిత్ సింగ్ సన్నీ సోహల్ RR vs PBKS
2009 చార్ల్ లాంగెవెల్డ్ట్ రాబ్ క్వినీ KKR vs RR
2010 అలీ ముర్తజా నమన్ ఓజా MI vs RR
2012 టిడి సుధీంద్ర ఫాఫ్ డు ప్లెసిస్ఎం DC vs CSK
2019 అల్జారి జోసెఫ్ డేవిడ్ వార్నర్ఎం MI vs SRH
2022 మథీష పతిరానా శుభ్‌మాన్ గిల్ CSK vs GT
2025 అశ్వని కుమార్ఎం అజింక్య రహానే MI vs KKR

ఐపీఎల్ అరంగేట్రంలో ఎంతమంది ఎంఐ స్టార్లు తొలి బంతికే వికెట్ తీసుకున్నారు?

ఐపీఎల్ అరంగేట్రంలో తొలి బంతికే వికెట్ తీసిన మూడో ముంబై క్రికెటర్‌గా అశ్వని కుమార్ నిలిచాడు.

అలీ ముర్తజా vs RR, 2010 (నమన్ ఓజా)

అల్జారి జోసెఫ్ vs SRH, 2019 (డేవిడ్ వార్నర్)

అశ్వనీ కుమార్ vs KKR, 2025 (అజింక్య రహానే).