L2: Empuraan: మోహన్ లాల్ సినిమాకు మరో షాక్.. బ్యాన్ చేయాలంటూ రైతులు నిరసన.. ఎందుకంటే..
మలయాళీ స్టార్స్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన లేటేస్ట్ మూవీ ఎల్ 2 : ఎంపురాన్. మార్చి 27న విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమలోని కొన్ని సీన్స్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ రైతులు నిరసన చేస్తున్నారు.

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ ఎల్ 2 : ఎంపురాన్. ఇందులో స్టార్ హీరో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించగా.. టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, సూరజ్ కీలకపాత్రలు పోషఇంచారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించగా , సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందించారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఇప్పుడు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు.
ఈ చిత్రంలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంపై వివాదం నెలకొంది. హిందూ సంస్థలు ఈ చిత్రాన్ని ఖండిస్తూ ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని హిందూత్వ సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ చిత్రానికి కథ రాసిన మురళీ గోపి ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్’ చిత్రంలో కేరళలోని వామపక్ష నాయకులను తప్పుగా చిత్రీకరించారని విమర్శలు ఎదుర్కొనడం గమనార్హం. ఈ వివాదం గురించి మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి తమిళనాడు నుండి కూడా వ్యతిరేకత వచ్చింది. ఆ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు తిరుప్పూర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముల్లపెరియార్ ఆనకట్టను పేల్చివేయడం గురించి వ్యాఖ్యలు ఉన్న ఎంపురాన్ సినిమాను తమిళనాడు ప్రభుత్వం నిషేధించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు రైతు సంఘం 2025 ఏప్రిల్ 1న ఎంబురాన్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద దిగ్బంధిస్తాము అని అన్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..