15 January 2026

రీ ఎంట్రీ పెద్దగా ఉపయోగపడలేదా..! కాజల్‌కు అవకాశాలు లేనట్టేనా..?

Rajeev 

Pic credit - Instagram

కాజల్ అగర్వాల్ తెలుగులో కనిపించి చాలా రోజులు అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ చందమామగా క్రేజ్ తెచ్చుకుంది.

లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. 

చందమామ సినిమాతో హిట్, మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. 

ఇక ఆతర్వాత తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది. 

కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. 

పెళ్లి తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో నటించింది. అలాగే హిందీలోనూ ఓ సినిమా చేసింది. 

కానీ కాజల్ కు రీ ఎంట్రీ పెద్దగా ఉపయోగపడలేదు.. ఇప్పుడు పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది ఈ చిన్నది.