AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil : కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురు ఏం చేస్తుందంటే.. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ గురించి చెప్పిన సునీల్..

తెలుగు సినిమా ప్రపంచంలో తన కామెడీ, నటనతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేశారు సునీల్. దశాబ్దాలుగా సినీప్రయాణంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కమెడియన్ గా, విలన్ గా, హీరోగా కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సునీల్ ఫ్యామిలీ గురించి బయట అంతగా తెలియదు.

Sunil : కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురు ఏం చేస్తుందంటే.. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ గురించి చెప్పిన సునీల్..
Sunil
Rajitha Chanti
|

Updated on: Jan 15, 2026 | 9:04 PM

Share

టాలీవుడ్ నటుడు సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాస్యనటుడి నుండి హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం పాన్-ఇండియా స్టార్‌గా అనేక భాషా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే సునీల్ సినిమాల సంగతి పక్కన పెడితే.. తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఎక్కడ బయటపెట్టరు. అలాగే సునీల్ భార్య, పిల్లలు సైతం సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భార్య శృతి, పిల్లలు కావ్య కుందన, దుష్యంత్‌ల గురించి పంచుకున్నారు. తన సినీ కెరీర్‌లో హాస్యనటుడి నుండి హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక మలుపులు తిరిగిందని.. ఈ మార్పులను తాను వ్యక్తిగతంగా తీసుకోలేదని, కేవలం పాత్రలను మాత్రమే చూస్తానని చెప్పుకొచ్చారు. పుష్ప 2, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష వంటి తెలుగు చిత్రాలతో పాటు రజనీకాంత్ జైలర్, శివకార్తికేయన్ మహావీరుడు, విశాల్ మార్క్ ఆంటోనీ, కార్తి జపాన్ వంటి తమిళ చిత్రాలతో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.

సునీల్ తన కెరీర్‌లో తమిళ చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. భాషాపరంగా ఉన్న అడ్డంకులను అధిగమించి, ఆయా పాత్రల కోసం మాండలికాలను నేర్చుకుంటున్నానని చెప్పారు. పుష్ప చిత్రంలో చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవడం దీనికి నిదర్శనమన్నారు. మధురై తమిళం వంటి కఠినమైన మాండలికాలను కూడా నేర్చుకుంటూ, తమిళంలో హీరోగా అవకాశాలు వస్తున్నాయని, ఇది నటనకు ఎలాంటి సరిహద్దులు లేవని నిరూపిస్తుందని సునీల్ అన్నారు. నవ్వించడం అనేది సిక్స్ ప్యాక్ కంటే చాలా కష్టమైన పని అని, ఈ డిజిటల్ యుగంలో ప్రజలను నవ్వించడం మరింత సవాలుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

దర్శకుడు త్రివిక్రమ్‌తో తన స్నేహం గురించి మాట్లాడుతూ, త్రివిక్రమ్‌ను తాను గురూజీ అని పిలుస్తానని చెప్పారు. త్రివిక్రమ్‌కు ఎన్నో విషయాలపై లోతైన జ్ఞానం ఉందని, ఎవరికైనా సందేహాలుంటే వాటిని స్పష్టంగా వివరించగల గురు స్వభావం ఆయనలో ఉందని సునీల్ పేర్కొన్నారు. పంజాగుట్టలోని హిందీ నగర్‌లో చిన్న రూమ్ నుండి ఇద్దరి ప్రయాణం ప్రారంభమైందని, వారి స్నేహం దైవసంకల్పమని ఆయన అన్నారు.

తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తన భార్య పేరు శృతి అని, తన కుమార్తె కావ్య కుందన 10వ తరగతి చదువుతుందని, కుమారుడు దుష్యంత్ 6వ తరగతి చదువుతున్నాడని సునీల్ వెల్లడించారు. తనది ఉమ్మడి కుటుంబమని, దేవుడి దయ వల్ల తాను సుస్థిరమైన జీవితాన్ని గడుపుతున్నానని, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన కెరీర్‌కు ఎటువంటి పరిమితులు లేవని, వచ్చిన అవకాశాలను ఆస్వాదిస్తానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..

ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురు ఏం చేస్తుందంటే.. సునీల్..
కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురు ఏం చేస్తుందంటే.. సునీల్..
తక్కువ వడ్డీకి హోమ్‌ లోన్‌ ఇచ్చే టాప్‌ 5 బ్యాంక్స్‌ ఇవే!
తక్కువ వడ్డీకి హోమ్‌ లోన్‌ ఇచ్చే టాప్‌ 5 బ్యాంక్స్‌ ఇవే!
సరికొత్త డిజైన్‌తో మహీంద్రా XUV 7XO.. కేవలం రూ.21 వేలతోనే బుకింగ్
సరికొత్త డిజైన్‌తో మహీంద్రా XUV 7XO.. కేవలం రూ.21 వేలతోనే బుకింగ్
చిటికెలో ప్లేట్ ఖాళీ! బ్యాచిలర్స్ కి బెస్ట్ వెల్లుల్లి ఎగ్ రైస్
చిటికెలో ప్లేట్ ఖాళీ! బ్యాచిలర్స్ కి బెస్ట్ వెల్లుల్లి ఎగ్ రైస్
మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట