15 రోజుల్లో 8 కిలోలు తగ్గిన హీరోయిన్.. డైట్ ప్లాన్ ఇదేనట.. 

Rajitha Chanti

Pic credit - Instagram

15 January 2026

సెలబ్రిటీల జీవితంలో నటనతో పాటు ఫిట్‌నెస్ కూడా ముఖ్యమే. సౌత్ స్టార్ హీరోయిన్ కేవలం 15 రోజుల్లో 8 కిలోల బరువు తగ్గిందట. 

ఆమె మరెవరో కాదు హీరోయిన్ మాళవిక మోహనన్. ఒక సినిమా పాత్ర కోసం కేవలం 15 రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. 

పాత్ర కోసం తనను బరువు తగ్గాలని చెప్పారట. కఠినమైన, అసాధారణమైన ఆహారాన్ని అనుసరించాల్సి వచ్చిందని తెలిపింది.

చాలా తక్కువ కార్బ్ తీసుకోవడంతో కూడిన క్రాష్ డైట్‌ను తాను తీసుకున్నానని మాళవిక చెప్పింది. కఠినమైన వ్యాయమం చేసిందట.

రోజువారీ భోజనం కేవలం ఒక ఆపిల్, గుడ్డులోని తెల్లసొనకే పరిమితం చేసిందట. రోజంతా వేరే ఆహారమే తీసుకోలేదని తెలిపింది. 

శారీరకంగా అలసిపోయినట్లు అనిపించిందని.. అయినప్పటికీ సినిమా, పాత్ర కోసం కఠినమైన డైట్ ఫాలో అయినట్లు చెప్పుకొచ్చింది.

మాళవిక మోహనన్ మలయాళ సినిమాల్లోకి పట్టం పోల్ (2013) తో అరంగేట్రం చేసింది. తర్వాత తమిళం, మలయాళంలో నటించింది.

ఇటీవల రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన వచ్చింది.