సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సొంతూరు నారావారిపల్లెలో కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మట్టి వాసన మరువకూడదన్న సందేశాన్ని ఇచ్చారు. మనవడితో ఆటలు ఆడి, ఎడ్లబండిపై తిరిగారు. హరిదాసులు, గంగిరెద్దుల ప్రదర్శనలు వీక్షించి, సంప్రదాయ పిండివంటలతో పండుగను ఆస్వాదించారు.