15 January 2026

బందించేస్తున్న బాంధవి..  సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ 

Rajeev 

Pic credit - Instagram

బాంధవి శ్రీధర్ .. ఈ అందాల భామ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

 2022లో విడుదలైన మసూద అనే హారర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. 

 ఆ చిత్రంలో ఆమె దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో నటించి, తన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది.

 దాంతో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. బాంధవి శ్రీధర్ హీరోయిన్‌గా అడుగుపెట్టడానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది.

ఆమె మిస్టర్ పర్‌ఫెక్ట్ , రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.

2019లో మిస్ ఇండియా రన్నరప్ గా.. మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019 టైటిల్స్‌ను గెలుచుకుంది.

ఇప్పుడు హీరోయిన్ గా ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫొటోలతో కవ్విస్తుంది ఈ అమ్మడు.