Tollywood: అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్.. ఇప్పుడు అవకాశాల కోసం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కొన్నాళ్లు ఇండస్ట్రీ నుంచి గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్.. ఆ తర్వాత ఊహించని లుక్ లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది.

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. మలయాళీ చిత్రపరిశ్రమకు చెందిన ఈ అమ్మాయి బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అతి తక్కువ సమయంలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది.
ఇన్నాళ్లు కథానాయికగా ప్రేక్షకులను అలరించిన ఈ వయ్యారి.. తొలిసారిగా అమ్మ పాత్రలో కనిపించి అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది. నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఓటీటీలో ఓ సూపర్ హిట్ సినిమాలో కనిపించింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నివేదా థామస్. ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఇందులో అమ్మ పాత్రలో మెప్పించింది. 1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించింది నివేదా.
2002లో మలయాళంలో ఉత్తర అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై మై డియర్ భూతం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రేచేవారెవరురా, దర్బార్, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..