New Year Gift: రైతులకు కొత్త సవంత్సరం కానుక.. సంక్రాంతికి ముందే వాటి పంపిణీకి నిర్ణయం!
Andhra Pradesh new passbooks: ఏపీ రైతులకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త చెప్పారు. జనవరి 9లోగా 21.8 లక్షల కొత్త పట్టాదారు పాసుబుక్‌లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తప్పులు సరిచేసిన తర్వాత రాజముద్రతో కూడిన పాసుబుక్‌లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తహసీల్దారు కార్యాలయాలకు చేరిన వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత రైతులకు అందజేయనున్నారు.

ఆంధ్రప్రదేదశ్ రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశం తర్వాత ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. జనవరి 9లోగా రాష్ట్రంలో 21.8 లక్షల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కొత్త పాస్ బుక్‌లను రాజముద్రతో రూపొందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎలాంటి తప్పులు లేకుండా.. తప్పులు సరిచేశాకే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు రైతులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు తహసీల్దారు కార్యాలయాలకు చేరుకున్నాయి. అయితే సీఎం ఆదేశాలతో వాటిలో ఎలాంటి తప్పులు లేకుండా చూసేందుకు వాటిని పూర్తిగా తనిఖీ చేస్తున్నారు అధికారులు. వీటిని క్షుణ్నంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేవని స్పష్టమయ్యాక పంపిణీ చేయనున్నారు అధికారులు.
అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 8 వేల గ్రామాల్లో భూముల సమగ్ర రీసర్వే నిర్వహించి.. రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేశారు. కానీ ఆ పట్టదారు పుస్తకాలపై నాటి సీఎం వైఎస్ జగన్ ఫోటోలు ఉండడాన్ని తప్పుపట్టిన టీటీడీ.. భూముల సర్వేలో అవకవతకలు జరిగాయాలు.. తాము అధికారంలోకి వస్తే.. కొత్త పట్టదారు పాసు పస్తకాలను జారీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజాగా కొత్త పాసుబక్స్ ఇచ్చేందుకు సిద్దమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
