AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్‌'' లయన్‌ స్కార్‌ఫేస్‌కు కోట్లలో అభిమానులు .. ఎందుకంటే! వీడియో

స్టార్‌” లయన్‌ స్కార్‌ఫేస్‌కు కోట్లలో అభిమానులు .. ఎందుకంటే! వీడియో

Samatha J

|

Updated on: Mar 31, 2025 | 1:39 PM

కంటిపై గాటుతో కనిపించే ఈ మృగరాజు జీవితాంతం సవాళ్లతో పోరాడింది. స్థానిక సింహాలనే కాదు.. వేటగాళ్ల దాడులను సైతం దీటుగా ఎదుర్కొంది. ఎదురే లేని రారాజుగా నిలిచింది. ఆఫ్రికా ఖండం కెన్యాలోని మసాయి మారా నేషనల్‌ పార్కులో స్కార్‌ ఫేస్‌ లయన్‌ గురించే మనం చెప్పుకుంటున్నాం. ఈ సింహం ఓ టెర్రర్‌. మగ సింహాల మధ్య ఆధిపత్య పోరులో గెలిచి శత్రు గుంపులోని ఆడ సింహాలతో పాటు ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంది. స్కార్‌ఫేస్‌ లయన్‌ 14 ఏళ్ల జీవిత కాలంలో 130 మగ సింహాలను 400కు పైగా తోడేళ్లను హతమార్చింది. ఖడ్గమృగాలు, బలీయమైన మొసళ్లను చంపేసింది. సాధారణంగా సింహాలు హిప్పోల జోలికి పోవు. కానీ ఈ స్కార్‌ ఫేస్‌ లయన్‌ ఓ మగ హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది.

సాధారణంగా సింహాల గుంపులో 5 నుంచి 20 వరకు ఉంటాయి. కానీ ఈ మృగరాజు మాత్రం 120 సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది. అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్‌ అంటే హడల్‌. 2012లో ఓ గుంపులోని ఆల్ఫా లయన్‌తో జరిగిన పోరాటంలో కుడి కంటికి, దాని పైభాగంలో లోతైన గాయమైంది. అదే పెద్ద గాటుగా మారిపోయింది. దాంతో దానికి‘స్కార్‌ ఫేస్‌ లయన్‌’గా సందర్శకులు పేరు పెట్టారు. ఈ సింహం 2021 జూన్‌ 11న వృద్ధాప్యంతో మరణించింది. ఇప్పటికీ మసాయి మారా సందర్శనకు వచ్చే వారికి ఈ స్కార్‌ ఫేస్‌ లయన్‌ డాక్యుమెంటరీ చూపిస్తారంటే దాని ప్రత్యేకతను అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మృగరాజు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కోట్లలో వ్యూస్‌ దక్కించుకున్నాయి. అడవుల్లో సింహాలు గరిష్టంగా 12 ఏళ్లు బతికితే.. ఇది మాత్రం 14 సంవత్సరాలు జీవించింది. ఇదేం పెద్ద గొప్పకాకున్నా.. బతికినంత కాలం రారాజుగానే ఉండి, సహజ మరణం పొందడమే విశేషం.

మరిన్ని వీడియోల కోసం :

ఆ గ్రామాల ప్రజలకు సడెన్‌గా బట్టతల ఎందుకొచ్చింది? వీడియో

గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడి..హమాస్ నేత మృతి

బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?