Beauty Care: టమాటాలో ఇది కలిపి రాస్తే.. మీ ఫేస్ క్షణాల్లో మెరుస్తుంది!

ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో సరైన పోషకాహారం అందక చర్మం నిర్జీవంగా తయారవుతుంది. దీంతో అందవిహీనంగా కనిపిస్తున్నారు. దానికి తోడు గంటల కొద్ది కంప్యూటర్లు, లాప్ ట్యాప్స్, మొబైల్స్ ముందు కూర్చోని పని చేయడం వల్ల ఈ ప్రభావం కూడా ఫేస్ పై పడుతుంది. దీంతో ఫేస్ లో గ్లో లేకుండా ఉంటుంది. అలాగే సరైన సమయం లేకపోవడంతో బ్యూటీ పార్లర్స్ లేదా చర్మ నిపుణుల వద్దకు పరుగులు..

Beauty Care: టమాటాలో ఇది కలిపి రాస్తే.. మీ ఫేస్ క్షణాల్లో మెరుస్తుంది!
Tomato
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 25, 2023 | 8:45 AM

ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో సరైన పోషకాహారం అందక చర్మం నిర్జీవంగా తయారవుతుంది. దీంతో అందవిహీనంగా కనిపిస్తున్నారు. దానికి తోడు గంటల కొద్ది కంప్యూటర్లు, లాప్ ట్యాప్స్, మొబైల్స్ ముందు కూర్చోని పని చేయడం వల్ల ఈ ప్రభావం కూడా ఫేస్ పై పడుతుంది. దీంతో ఫేస్ లో గ్లో లేకుండా ఉంటుంది. అలాగే సరైన సమయం లేకపోవడంతో బ్యూటీ పార్లర్స్ లేదా చర్మ నిపుణుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఇలా కాకుండా ఒక్కసారి ఇంట్లో నేచురల్ రెమిడీస్ పాటించడం వల్ల క్షణాల్లోనే స్కిన్ ని మెరిపించు కోవచ్చు. ఇలా చేయడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టిప్ 1:

టమాటా, పసుపులో చర్మాన్ని కాపాడే చక్కని పోషకాలు ఉన్నాయి. బాగా పండిన టమాటాని తీసుకుని మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకోండి. అందులో కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన ప్యాక్ ని ముఖానికి రాసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా కాసేపు ఆ ప్యాక్ ఆరిపోయాక.. చల్లని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ని అప్లై చేయండి. ఇలా చేస్తే స్కిన్ టైట్ గా, షైనీగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే కొంత మందికి టమాటా పడదు. దీంతో అలర్జీ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా మంచింది. ముందుగా ఈ ప్యాక్ ని కొద్దిగా చేతులకు వేసుకోవడం మంచింది. ఎలాంటి అలర్జీ, దురద, దద్దర్లు లేకపోతే అప్పుడు ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు.

టిప్ 2:

ఒక చిన్న బౌల్ లోకి కొద్దిగా చక్కెర, టమాటాను రౌండ్ గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు సగం టమాటాను తీసుకుని దానిపై చక్కెర వేసి ముఖానికి చాలా సున్నితంగా అప్లై చేయండి. ఇలా ముఖం, కాళ్లూ, చేతులు మీద స్క్రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫేస్ పై దుమ్ము, దూళి, డెడ్ స్కిన్ సెల్స్ పోయి.. స్కిన్ మెరుస్తుంది. ఇలా వారానికి ఒక్కసారి చేసినా స్కిన్ ఇంప్రూవ్ మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ టిప్ ని ఎలాంటి వారికైనా బాగా సూట్ అవుతుంది.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.