- Telugu News Photo Gallery Are the soles and hands sweating profusely? Follow these tips, check here is details
Sweat at Hands: అరికాళ్లకు, చేతులకు ఎక్కువగా చెమట పడుతుందా.. అయితే ఈ టిప్స్ పాటించండి!
ఏదైనా పని చేస్తున్నప్పుడు చెమలు పట్టడం సాధారణమైన విషయం. అదే కొంత మందికి మాత్రం ఏ పని చేసినా.. చేయకపోయినా.. కాళ్లకు, చేతులకు చమట పడుతూ ఉంటుంది. అలాంటి వారు షూస్, చెప్పులు వేసుకున్నా చమటకు జారుతూ ఉంటాయి. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాళ్లకు మురికి అంతా చేరుతుంది. దీంతో పాదాలు కూడా నల్లగా మారతాయి. చెప్పులు కూడా ఎక్కువ రోజులు రావు. అలాగే చమట వాసన ఎక్కువగా వస్తుంది. దీంతో నలుగురిలో రావడానికి..
Updated on: Oct 25, 2023 | 8:00 AM

ఏదైనా పని చేస్తున్నప్పుడు చెమలు పట్టడం సాధారణమైన విషయం. అదే కొంత మందికి మాత్రం ఏ పని చేసినా.. చేయకపోయినా.. కాళ్లకు, చేతులకు చమట పడుతూ ఉంటుంది. అలాంటి వారు షూస్, చెప్పులు వేసుకున్నా చమటకు జారుతూ ఉంటాయి. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాళ్లకు మురికి అంతా చేరుతుంది. దీంతో పాదాలు కూడా నల్లగా మారతాయి. చెప్పులు కూడా ఎక్కువ రోజులు రావు. అలాగే చమట వాసన ఎక్కువగా వస్తుంది. దీంతో నలుగురిలో రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యల వలన ఇలాంటి వాటిని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే కొన్ని రకాల టిప్స్ ను తీసుకొచ్చాం. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

క్లీన్ చేసుకోవడం: కాళ్లకు, చేతులకు తరచూ చెమటలు పడుతూ ఉంటే.. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇలాంటి వారు స్మెల్ ఎక్కువగా వచ్చే సోప్స్ కంటే.. మైల్డ్ సోప్స్ ని వాడాలి. దీని వల్ల చాలా వరకూ ఈ సమస్య తగ్గుతుంది.

షూ - సాక్సులు: కాళ్లకు చెమటలు ఎక్కువగా పట్టేవారు.. టైట్ గా ఉండే షూ వేసుకోవడం కంటే.. కాస్త వదులుగా ఉండే షూని వేసుకుంటే మంచిది. అలాగే కాళ్లకు చెమటలు వచ్చే వారు సాక్స్ ఎంచుకునేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి వారు నీటిని పీల్చుకునే కాటన్ సాక్స్ ని ఎంచుకోవడం మంచిది. ఎందుకుంటే ఇది చెమటను బాగా గ్రహిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్: కాళ్లు, చేతులకు చమటలు ఎక్కువగా పట్టే వారికి యాపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపయోగ పడుతుంది. నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి అందులో కాళ్లు, చేతులను ఓ 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా చేయడం వల్ల.. యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు.. చెమటను నియంత్రించి, దుర్వాసన రాకుండా చేస్తాయి.

బ్లాక్ టీ: చేతులు, కాళ్లలో చెమట ఎక్కువ పట్టే వారు బాక్ల్ టీ ని వాడవచ్చు. బ్లాక్ టీ డికాషన్ లో చేతులు, కాళ్లను ఓ అరగంట పాటు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల చేతులు, పాదాల్లో వచ్చే చెమటను తగ్గిస్తాయి.




