Curd Health: వామ్మో.. డైలీ పెరుగు తింటున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

Curd Health: ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంతో.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అయితే, ఆరోగ్యానికి సంబంధించి మంచిగా ప్రోటిన్లు, విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. ఇలాంటి ఆహారంలో పాలు ఒకటి.. పాలలో ఎన్నో ప్రోటిన్లు ఉన్నాయి. అయితే, పాలు, దానితో చేసిన ఆహార పదార్థాలు ఏవైనా ఎల్లప్పుడూ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు.

Curd Health: వామ్మో.. డైలీ పెరుగు తింటున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Curd
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 25, 2023 | 5:36 PM

Curd Health: ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంతో.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అయితే, ఆరోగ్యానికి సంబంధించి మంచిగా ప్రోటిన్లు, విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. ఇలాంటి ఆహారంలో పాలు ఒకటి.. పాలలో ఎన్నో ప్రోటిన్లు ఉన్నాయి. అయితే, పాలు, దానితో చేసిన ఆహార పదార్థాలు ఏవైనా ఎల్లప్పుడూ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ముఖ్యంగా పెరుగు.. కొంతమంది ఆహారంతో పాటు పెరుగును ఖచ్చితంగా తింటారు. పెరుగులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. కాబట్టి పెరుగు తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. దహీ వడా, రైతా వంటి పెరుగుతో చేసిన వివిధ రకాల వంటకాలను చాలా మంది ఎంతో ఉత్సాహంగా తింటారు. అంతేకాకుండా.. మజ్జిగను కూడా తీసుకుంటారు. ఇలా.. ప్రతిరోజూ పెరుగు తినడానికి ఇష్టపడతారు.

వాస్తవానికి పెరుగులో చాలా విటమిన్లు, మినరల్స్ దాగున్నాయి. అందుకే ఇది ఆరోగ్యకరమైన ఆహారంలో వస్తుంది. అయితే పెరుగు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. తింటే ఏమవుతుంది..? అనే దానిపై నిపుణులు పలు అభిప్రాయాలను వెల్లడించారు. మీరు ఆరోగ్యంగా ఉండి ఇంకా రోజూ పెరుగు తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు. అయితే, పెరుగు తినే సమయాన్ని బట్టి, అది హాని లేదా ప్రయోజనం కలిగించవచ్చు. పెరుగును రాత్రిపూట తీసుకుంటే, అది ఛాతీలో బిగుతుగా మారవచ్చు. కాబట్టి రోజూ పెరుగు తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

  1. ప్రొటీన్: మన శరీరంలోని చాలా అవయావాలు.. కేవలం ప్రొటీన్‌తోనే తయారవుతాయి. ఎందుకంటే అమైనో ఆమ్లాలు శరీరంలోని చాలా కణాల పెరుగుదలకు సహాయపడతాయి. పెరుగు తినడం ద్వారా మీకు అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. కండరాలు, చర్మం, వెంట్రుకలు, గోళ్లు ఇలా అన్నీ ప్రొటీన్లతోనే తయారవుతాయి. అందువల్ల, మీరు ప్రతిరోజూ పెరుగు తింటే, శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుంది.
  2. ప్రోబయోటిక్స్: ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే అనేక మంచి బ్యాక్టీరియాలు ప్రేగులలో కనిపిస్తాయి. ఈ బాక్టీరియా కడుపులో ఉండేలా చూసుకోవాలంటే పెరుగు తినడం అవసరం. పెరుగు శరీరంలో మంచి బ్యాక్టీరియాను నిర్వహిస్తుంది. రోజూ పెరుగు తినడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. కాల్షియం: పాలు, పాలతో తయారు చేసిన అన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి సమృద్ధిగా కాల్షియం అందిస్తాయి. కాల్షియం శరీరంలోని ఎముకలను బలపరుస్తుంది. కాబట్టి పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలోని కాల్షియం లోపాన్ని తీర్చి, ఎముకలు బలహీనపడవు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే