Watch : ట్రోఫీ పట్టుకుని సిగార్‌తో టీమ్ డేవిడ్ ఫోజులు.. ఓవరాక్షన్ చేసినందుకు తగిన శాస్తి చేసిన బీసీసీఐ
Watch : నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టిమ్ డేవిడ్ మైదానంలోనే సిగార్ కాలుస్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బుధవారం విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆయన చుట్టూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన సహచర ఆటగాళ్లు కూడా ఉన్నారు.

Watch : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలుచుకున్న ఆనందంలో మునిగితేలుతుండగా, ఆ జట్టు హిట్టర్ టిమ్ డేవిడ్ చుట్టూ ఒక పెద్ద వివాదం రాజుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టిమ్ డేవిడ్ మైదానంలోనే సిగార్ కాలుస్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బుధవారం విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆయన చుట్టూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన సహచర ఆటగాళ్లు కూడా ఉన్నారు.
ఈ వైరల్ వీడియో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రికార్డ్ అయినట్లు స్పష్టమవుతోంది. వీడియోలో టిమ్ డేవిడ్ పక్కన రోమారియో షెపర్డ్ నిలబడి ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. మరో ఆర్సీబీ ప్లేయర్ ఫిల్ సాల్ట్‌తో మాట్లాడుతుండటం కనిపించింది. దీనికి తోడు, టిమ్ డేవిడ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో కూడా నోట్లో సిగార్ పెట్టుకుని, ఫిల్ సాల్ట్‌తో కలిసి ఐపీఎల్ ట్రోఫీ పట్టుకుని ఫోజులివ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
Tim David after cooking the umpires throughout the szn pic.twitter.com/BfZXaqbInu
— sir jacob bethell era (@bet_helll) June 3, 2026
ఈ సిగార్ వివాదం పక్కన పెడితే, ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇప్పటికే టిమ్ డేవిడ్‌పై ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కఠిన చర్యలు తీసుకుంది. లీగ్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినందుకు గాను మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఆయనకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను విధించారు. ఒక మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలను లేదా వాటర్ బాటిల్స్, ఐస్ బ్యాగ్స్ వంటి వస్తువులను అంపైర్లు, ఆటగాళ్లు లేదా అఫీషియల్స్‌పైకి ప్రమాదకర రీతిలో విసరడాన్ని ఈ నిబంధన నిషేధిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఒక వికెట్ పడిన సమయంలో టిమ్ డేవిడ్ ఆగ్రహంతో ఐస్ బ్యాగ్‌ను అంపైర్ నితిన్ మీనన్ వైపు విసిరినట్లు బోర్డు నిర్ధారించింది.
టిమ్ డేవిడ్ ఈ సీజన్లో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు 20వ మ్యాచ్‌లో ఒక డీమెరిట్ పాయింట్, 54వ మ్యాచ్‌లో రెండు డీమెరిట్ పాయింట్లు సాధించిన ఆయన, తాజా వివాదంతో మరో రెండు పాయింట్లు తెచ్చుకుని మొత్తం 5 డీమెరిట్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు ఒకే సీజన్లో ఐదు డీమెరిట్ పాయింట్లు దాటితే వారిపై ఆటోమేటిక్‌గా ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే మొదటి మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ దూరం కానున్నారు. ఈ తప్పిదాన్ని టిమ్ డేవిడ్ స్వయంగా అంగీకరించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
