AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

All-Party Meeting: నేడే ఆల్‌పార్టీ మీటింగ్.. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవేనా?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 13వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశానికి ముందు రోజులు ఆదివారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని పార్టీలు పాల్గొననున్నాయి. అయితే ఈ మీటింగ్‌ సందర్భంగా ప్రతిపక్షాలు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం

All-Party Meeting: నేడే ఆల్‌పార్టీ మీటింగ్.. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవేనా?
All Party Meeting
Anand T
|

Updated on: Jul 19, 2026 | 9:30 AM

Share

దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆఖిలపక్షమ సమావేశం నిర్వహించేందుకు సిద్దమైంది కేంద్ర ప్రభుత్వం. అటు ప్రతిపక్షాలు సైతం ఈ సమావేశంలో కీలక విషయాలను ప్రస్థావించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నీట్‌ పేపర్ లీక్ వ్యవహారం, ఈ సంఘటనకు వ్యతిరేకంగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ చేపట్టిన నీరాహార దీక్ష, ఆయన్న బలవంతంగా హాస్పిటల్‌కు తరలించే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.

దీనితో పాటు అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం కూడా ఈ సమావేశంలో హాట్ టాపిక్‌గా మారనుంది. ఈ అంశంపై సమాజ్‌వాదీ పార్టీ (SP) ఇప్పటికే స్పందిస్తూ, రామాలయ విరాళాల అవకతవకలపై పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ల సమక్షంలో జరగనున్న ఈ సమావేశంలో ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కొత్త బిల్లులు ఇవే:

  • అయితే ఈ వర్షాకాల సమావేశాల్లోల కొన్ని ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. కాబట్టి ఆ బిల్లులు ఏంటనేది చూద్దాం.
  • జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు, 2026: వందేమాతరం ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తే కఠిన శిక్షలు విధించేలా 1971 నాటి చట్టాన్ని ఈ బిల్లు సవరిస్తుంది.
  • జనన, మరణాల నమోదు సవరణ బిల్లు, 2026: ఆలస్యంగా నమోదు చేసే జనన, మరణాల ప్రక్రియపై కఠిన నిబంధనలను తీసుకువస్తారు.
  • ఆదాయపు పన్ను సవరణ బిల్లు, 2026: ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపులు ఇచ్చే ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తెస్తున్నారు.
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు, 2026: సి.జె.ఐ (CJI) తో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచే ప్రతిపాదన ఇందులో ఉంది.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026: MSME రంగాన్ని బలోపేతం చేయడం, పునర్వ్యవస్థీకరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నేడే ఆల్‌పార్టీ మీటింగ్..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే
నేడే ఆల్‌పార్టీ మీటింగ్..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాస్తు చెప్పే ఈ 5 చిట్కాలు పాటిం
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాస్తు చెప్పే ఈ 5 చిట్కాలు పాటిం
579 కోట్లతో బాక్సాఫీస్ షేక్.. ఏడాది దాటిన తగ్గని డిమాండ్..
579 కోట్లతో బాక్సాఫీస్ షేక్.. ఏడాది దాటిన తగ్గని డిమాండ్..
23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ స్టార్ట్ చేసిన హైదరాబాద్ కుర్రాడు
23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ స్టార్ట్ చేసిన హైదరాబాద్ కుర్రాడు
టీటీడీ గోశాలలో గుర్రం మృతి.. శ్రీవారి సేవ చేయక ముందే..
టీటీడీ గోశాలలో గుర్రం మృతి.. శ్రీవారి సేవ చేయక ముందే..
వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా..
వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా..
ఆదివారం సూర్యారాధన: జలార్పణ ఎలా చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు?
ఆదివారం సూర్యారాధన: జలార్పణ ఎలా చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు?
జైస్వాల్ కోసం గిల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?
జైస్వాల్ కోసం గిల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?
వరంగల్: కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్
వరంగల్: కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్
రోజూ ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
రోజూ ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే