AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సక్సెస్ అంటే.. జస్ట్ 23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ.. హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ!

సక్సెస్.. ఇది అందరి సొంతం కాదనేది కేవలం అపోహ మాత్రమే.. సరైన లక్ష్యం, సరైన ప్రణాళిక, చేయగలమనే సంకల్పం, నిర్దేశిత మార్గదర్శకం, ముందడుగు వేసే ధైర్యం ఉంటే.. విజయం ఎవరికైనా గులాం అవ్వాల్సిందేనని హైదరాబాద్‌కు చెందిన ఓ 23 ఏళ్ల కుర్రాడు నిరూపించాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఏడాదిన్నరలోనే ఓ స్టార్టప్ కంపెనీ పెట్టి.. 23 ఏళ్లకే రూ. 20 కోట్ల టర్నోవర్‌తో చరిత్ర సృష్టించాడు. ఇంతకూ ఎవరా కుర్రాడు.. అతను పెట్టిన కంపెనీ ఏంటి.. ఏడాదిన్నరలోనే అతనికి ఈ సక్సెస్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇది కదా సక్సెస్ అంటే.. జస్ట్ 23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ.. హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ!
Gopisetti Saiteja Success Story
Anand T
|

Updated on: Jul 19, 2026 | 9:04 AM

Share

జస్ట్ 23 ఏళ్లకే కంపెనీ స్టార్ట్ చేసి.. ఏడాదిన్నరలోనే రూ. 20 కోట్ల టర్నోవర్ సాధించి చరిత్ర సృష్టించాడు హైదరాబాద్‌ నగరానికి చెందిన గోపిశెట్టి సాయితేజ. వోక్సెన్ (Woxsen) యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా పొందాడు సాయితేజ. చదువు పూర్తయిన తర్వాత అందరిలా ఉద్యోగాల వేట కొనసాగించకుండా.. సరికొత్తగా ఆలోచించాడు. వ్యవసాయ రంగానికి తోడ్పడేలా ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. ఆ ఆలోచనకు పదును పెట్టిన సాయితేజ, 2025లో ‘లూమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే అగ్రి కంపెనీని స్టార్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని ఆల్వాల్ కేంద్రంగా తన కంపెనీని రన్ చేస్తున్న సాయితేజ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలతో పాటు సుస్థిర వ్యవసాయ పరిష్కారాలను అందించగలిగాడు. దీంతో కంపెనీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే అతను తన వ్యాపారాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడు.

వికాస్ ఆల్విస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జూలై 17న ‘ఎక్స్’ (ట్విట్టర్)లో చేసిన ఓ పోస్ట్‌లో.. సాయితేజ విజయం గురించి పేర్కొన్నాడు. విజయానికి వయసుతో సంబంధం లేదని క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 2025లో పబ్బ సంతోష్ అనే వ్యక్తితో కలిసి కంపెనీ స్టార్ట్ చేసిన సాయితేజ.. రైతులకు అండగా నిలుస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రూ. 20 కోట్లకు చేర్చాడు. కాగా, 2028 నాటికి కంపెనీ టర్నోవర్‌ను రూ. 100 కోట్లకు పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని సాయితేజ తెలిపాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. “ముందుకెళ్లే ధైర్యం, సరైన ప్రణాళిక, చేయగలమనే సత్తా ఉంటే.. విజయం తలవంచక తప్పదు” అని సాయితేజ నిరూపించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కంపెనీ స్టార్ట్ చేయడం ఒకెత్తయితే.. దాన్ని దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలబెట్టుకోవడమే వ్యాపార రంగంలో అసలైన సవాల్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. చిన్న వయసులోనే ఇంతటి విజయాన్ని అందుకున్న సాయితేజ, ఇప్పుడు స్టార్టప్‌లు పెట్టాలనుకునే ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా