AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : హిట్‌మ్యాన్‎కు అండగా నిలిచిన టీమ్ మేనేజ్‌మెంట్.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఏం చెప్పారంటే?

Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ ఖండించిన వేళ, టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా హిట్‌మ్యాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఫామ్‌పై ఆందోళనలు అవసరం లేదని, రోహిత్ త్వరలోనే భారీ ఇన్నింగ్స్‌లతో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Rohit Sharma : హిట్‌మ్యాన్‎కు అండగా నిలిచిన టీమ్ మేనేజ్‌మెంట్.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఏం చెప్పారంటే?
Rohit Sharma (18)
Rakesh
|

Updated on: Jul 19, 2026 | 7:18 AM

Share

Rohit Sharma : టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, క్రీడా వర్గాలలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరగబోయే మ్యాచ్‌తో రోహిత్ తన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకబోతున్నాడనే వార్తలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ ఊహాగానాలకు బీసీసీఐ శనివారం ఒక అధికారిక ప్రకటనతో పూర్తిగా అడ్డుకట్ట వేసింది. మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని వాటిలో ఎలాంటి వాస్తవం లేదని బోర్డు తేల్చిచెప్పింది.

హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్

ఈ రిటైర్మెంట్ పుకార్లపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. లార్డ్స్ స్టేడియంలో రోహిత్ శర్మ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై బోర్డు అంతర్గతంగా ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. అవన్నీ సోషల్ మీడియా సృష్టించిన అబద్ధాలని కొట్టిపారేశారు. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల్లో రోహిత్ శర్మ ఇప్పటికీ అత్యంత కీలకమైన భాగమని, జట్టు వ్యూహాల్లో ఉన్నంత కాలం అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూనే ఉంటాడని సైకియా తేల్చిచెప్పారు. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇంగ్లాండ్ సిరీస్‌లో నెమ్మదించిన రోహిత్ బ్యాటింగ్

బీసీసీఐ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన మరుసటి రోజే టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా కెప్టెన్ రోహిత్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. మొదటి రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొదటి మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేయగా, రెండో మ్యాచ్‌లో 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. పరుగులు తక్కువగా చేయడమే కాకుండా, ఈ సిరీస్‌లో అతని స్ట్రైక్ రేట్ కేవలం 54 గా ఉండటం క్రీడా విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కెప్టెన్ వెనక అండగా నిలిచిన టీమ్ మేనేజ్‌మెంట్

రోహిత్ శర్మ ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్‌పై విమర్శలు వస్తున్నప్పటికీ, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాత్రం హిట్‌మ్యాన్‌పై పూర్తి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. క్రికెట్‌లో కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించి, ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడం ఏ బ్యాటర్‌కైనా అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మకు అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉందని, గతంలో కూడా ఇలాంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఫామ్ లేమి సమస్యలను అధిగమించి సెంచరీలతో సమాధానం చెప్పిన రికార్డు అతనికి ఉందని గుర్తుచేశారు. జట్టు బ్యాటింగ్ లైన్-అప్‌కు రోహిత్ ఇచ్చే ఓర్పు, బ్యాలెన్స్ ఎంతో విలువైనవని మోర్కెల్ కొనియాడారు.

న్యూజిలాండ్ సిరీస్ నుంచి మొదలైన గండం

వాస్తవానికి ఈ ఏడాది జరిగిన న్యూజిలాండ్ సిరీస్ నుంచే రోహిత్ శర్మ ఆటతీరు సాధారణ స్థాయిలోనే సాగుతోంది. గత మూడు సిరీస్‌లలో కలిపి అతను ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కేవలం 241 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదైంది. ఈ గణంకాలు రోహిత్ స్థాయికి తగ్గట్టుగా లేకపోవడంతోనే సోషల్ మీడియాలో విమర్శలు, రిటైర్మెంట్ పుకార్లు వేగంగా వ్యాపించాయి. అయినప్పటికీ లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత కూడా రోహిత్ శర్మ భారత జట్టుతోనే ప్రయాణిస్తాడని, త్వరలోనే అతను తన పాత ఫామ్‌ను అందుకొని భారీ స్కోర్లు సాధిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌