AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ షోలోకి గుండె నిండా గుడి గంటలు బాలు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన విష్ణు..

గుండె నిండా గుడిగంటలు సీరియల్ బుల్లితెరపై సంచలన టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ అడియన్స్ మాత్రమే కాదు.. ఈతరం యువత సైతం ఈ సీరియల్ కు అభిమానులు అయ్యారంటే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సీరియల్ రీల్స్ తెగ హల్చ్ చేస్తుంటాయి. అయితే ఈ సీరియల్ తోపాటు ఇందులోని మీనా, బాలు పాత్రలకు సైతం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ షోలోకి గుండె నిండా గుడి గంటలు బాలు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన విష్ణు..
Bigg Boss 10 Telugu
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2026 | 10:22 AM

Share

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో సందడి మొదలైంది. త్వరలోనే సీజన్ 10 ఘనంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మరో మూడు నాలుగు రోజుల్లో అగ్నీ పరీక్ష ప్రోగ్రామ్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు అగ్నీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో మంది సెలబ్రెటీల పేర్లు మారుమోగుతున్నాయి. చాలా మంది ఆర్టిస్టుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అటు సీరియల్ తారలు.. ఇటు జబర్దస్త్ కమెడియన్లతోపాటు వివాదాస్పద ఇన్ స్టా ఇన్లుయెన్సర్స్ సైతం ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి షోలోకి సీరియల్ బ్యూటీ పల్లవి గౌడ, సీనియర్ హీరోయిన్ ఆనందం రేఖ, జబర్దస్త్ నూకరాజు, పవిత్ర, జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ తోపాటు పలువురి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ తార రక్షిత సైతం హౌస్ లోకి రానుందనే టాక్ వినిపిస్తుంది. ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫేమ్ బాలు సైతం పదో సీజన్ లో సందడి చేయనున్నాడనే టాక్ నడుస్తుంది. దీంతో అతడి ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రస్తుతం బుల్లితెరపై టాప్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ద్వారా మీనా, బాలు పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బాలు కామెడీ టైమింగ్, యాక్టింగ్ అంటే అమ్మాయిలకు విపరీతమైన ఇష్టం. అలాంటిది ఇప్పుడు బాలు సీరియల్ వదిలి బిగ్ బాస్ లోకి వెళ్తుండడంపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. దీంతో అతడి ఇన్ స్టా పోస్టుల కామెంట్స్ లో బిగ్ బాస్ ఆఫర్ గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న రూమర్స్, అభిమానుల స్పెషల్ రిక్వెస్ట్ పై వీడియో రిలీజ్ చేశాడు బాలు. అందులో తాను బిగ్ బాస్ వెళ్తున్నాననే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

“అందరికి నమస్కారం. ఈరోజు నేను ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను గుండె నిండా గుడి గంటలు సీరియల్ వదిలేసి బిగ్ బాస్ షోకు వెళ్తున్నానని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా, రీల్స్ ద్వారా మీరందరూ చూసి ఉంటారు. నేను కూడా చూశాను. దాంట్లో చూస్తే దాదాపు నాలుగు వేల మంది కామెంట్స్ చేశారు. నాక్కూడా పర్సనల్ గా మేసేజ్ చేశారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాలు గారు మీరు సీరియల్ వదిలేసి వెళ్లకండి. మీరు వెళ్తే ఆ ప్లేస్ లో వేరేవాళ్లను చూడలేమని చాలా మంది ప్రేమతో కామెంట్స్ చేస్తున్నారు. నేను బిగ్ బాస్ వెళ్లడం లేదు. మీరందరూ కోరుకున్నట్లు ఎప్పుడూ బాలు లాగే మీ ముందు ఉంటా.. బాలు లాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. దీనిలోనే తెలుస్తుంది మీరు నాపైన, మన సీరియల్ పైన ఎంత ప్రేమను పెట్టుకున్నారని. ఇప్పటివరకు మన సీరియల్ ను ఎంతో సపోర్ట్ చేశారు. ఇకపై కూడా మన సీరియల్ ను మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు ” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి తాను గుండె నిండా గుడి గంటలు సీరియల్ వదిలి బిగ్ బాస్ కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు బాలు విష్ణు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

బాలు వీడియో..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us