AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు చేస్తున్నారా..? పొరపాటున కూడా చేయకండి..

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్. పీఎఫ్ నిబంధనల గురించి తెలుసుకోకపోతే మీ అకౌంట్ ఇనాక్టివ్‌గా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఈపీఎఫ్‌వో నిబంధనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అకౌంట్ ఇనాక్టివ్ కావడం వల్ల అనేక నష్టాలు జరుగుతాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Aug 11, 2026 | 8:13 AM

Share
పీఎఫ్ ఖాతాలో పారదర్శకత, వేగవంతంగా సేవలు అందించేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం అనేక నియమ, నిబంధనలను అమలు చేస్తోంది. పీఎఫ్ రూల్స్ గురించి ప్రతీఒక్క ఖాతాదారుడు అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని తప్పులు చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతా ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవేంటి అనేది చూద్దాం.

1 / 5
ఈపీఎఫ్ఓ పదవీ విరమణ వయస్సును 58 ఏళ్లుగా నిర్ణయించింది.  కొంతమంది ఆ వయస్సు వచ్చేంతవరకు పని చేస్తే.. మరికొంతమంది 55 ఏళ్ల వయస్సు కంటే ముందే పదవీ విరమణ చేస్తారు. అయితే ఉద్యోగానికి పదవీ విరమణ చేశాక కొంతమంది పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకోవడం లేదా కొత్త అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం లాంటివి మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో మూడేళ్ల తర్వాత అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. దీనిని వల్ల మీకు పీఎఫ్ వడ్డీ జమ అవ్వదు.

2 / 5
55 ఏళ్ల కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటిస్తే 58 ఏళ్ల వచ్చేంతవరకు అకౌంట్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడం వల్ల వడ్డీ జమ అవుతూ ఉంటుంది. ఇక 58 ఏళ్లు వచ్చేలోపు మీ పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవాలి. అలా కాకుండా చాలా ఏళ్ల పాటు వాడకుండా వదిలిస్తే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. 55 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తే  58 ఏళ్ల వరకు వడ్డీ జమ అవుతుంది. ఆ తర్వాత అకౌంట్ వాడకపోతే ఇనాక్టివ్ అవుతుంది.

3 / 5
ఇక 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తే.. 63 ఏళ్ల వరకు వడ్డీ అందుతుంది. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేట్లు 8.25 శాతంగా ఉంది. ఇక శాశ్వతంగా విదేశాలకు వెళ్లడం, సభ్యుడు మరణించడం వంటి సందర్భాల్లో ఖాతా ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు. ఎక్కువకాలం అకౌంట్‌ను ఇనాక్టివ్‌గా ఉంచుకోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
అకౌంట్ ఇనాక్టివ్‌గా మారితే.. తిరిగి యాక్టివ్ చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. మీ కేవైసీ వివరాలు అందించడం వల్ల అకౌంట్ తిరిగి యాక్టివ్ అవుతుంది. అయితే ఇనాక్టివ్ ఖాతాల కోసం ఈ-ప్రాప్తి అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఈపీఎఫ్ఓ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ పోర్టల్ ద్వారా సులువుగా ఇనాక్టివ్ అకౌంట్లను గుర్తించడంతో పాటు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.

5 / 5
Follow Us