AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే కొలువులు! ఈ అర్హతలు ఉంటే చాలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ (BMC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వైద్యుల నుంచి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిర్వహించే ఈ నియామకాల ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఆర్‌బీఐ కార్యాలయాలకు వైద్య సేవలు అందించనున్నారు. అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే కొలువులు! ఈ అర్హతలు ఉంటే చాలు
RBI Bank Medical Consultant Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 19, 2026 | 9:42 AM

Share

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)లో ఉద్యోగం కోరుకునే వారికి భారీ శుభవార్త అదించింది. కాన్పూర్లోని ఆర్బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ (Bank’s Medical Consultant – BMC) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. గంటల చొప్పున వేతనం అందిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2 బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ (BMC) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ మెడిసిన్‌లో ఎంఎస్/ఎండీ (MS/MD) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత వైద్య సేవల్లో అనుభవం ఉండటం అవసరం. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో జూలై 31, 2026లోపు దరఖాస్తులు సంబంధిత ఆర్‌బీఐ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి. అభ్యర్థులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి పంపాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీఓ లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ.1,000 చొప్పున కాంట్రాక్ట్ ప్రాతిపదికన పారితోషికం అందజేస్తారు.

ఉద్యోగానికి సంబంధించిన పూర్తి అర్హతలు, విధులు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు చిరునామా వంటి వివరాల కోసం ఆర్‌బీఐ అధికారికలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అడ్రస్‌..

రీజినల్ డైరెక్టర్, రిజర్వ్‌ బ్యాంకు అఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్ మెంట్, (రిక్రూట్మెంట్ సెక్షన్), మహాత్మా గాంధీ మార్గ్, కాన్పూర్.

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!