Video: 10 సిక్స్‌లు.. 15 ఫోర్లు.. లంక బౌలర్లపై ఊచకోత.. జార్ఖండ్ డైనమేట్ తుఫాన్ ఇన్నింగ్స్ గుర్తుందా..

On This Day: సెహ్వాగ్ వికెట్ తీసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్ల ముఖాల్లో కనిపించిన చిరునవ్వు ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే 3వ స్థానంలో ఆడేందుకు వచ్చిన ధోనీ వారిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. పిచ్ స్థితిని గ్రహించి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత గేర్ మార్చి బౌలర్ ఎవరనేది చూడకుండా ఉతికారేశాడు.

Video: 10 సిక్స్‌లు.. 15 ఫోర్లు.. లంక బౌలర్లపై ఊచకోత.. జార్ఖండ్ డైనమేట్ తుఫాన్ ఇన్నింగ్స్ గుర్తుందా..
Ms Dhoni On This Day
Follow us
Venkata Chari

|

Updated on: Oct 31, 2023 | 12:49 PM

MS Dhoni, : ఎంఎస్ ధోని కెరీర్‌లోనే ఓ తుఫాన్ ఇన్నింగ్స్ సంబంధించిన ఈ కథ 18 ఏళ్లనాటిది. 2005లో జైపూర్‌ మైదానంలోకి అడుగుపెట్టి ధోనీ పెను తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. 50 ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంకతో భారత్‌ ఆడిన మ్యాచ్‌ ఇది. భారత్‌పై శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. భయపెట్టారు. తొలి ఐదు బంతుల్లోనే వారి ప్రభావం కనిపించింది. భారత ఓపెనింగ్ జోడీ సచిన్, సెహ్వాగ్‌లను తొలి ఓవర్‌లోనే అడ్డుకట్ట వేశారు. కానీ, సెహ్వాగ్ వికెట్ తీసిన సంబరాల్లో మునిగిన శ్రీలంక జట్టుకు.. అసలు సమ్యస అప్పుడే మొదలైంది.

సెహ్వాగ్ వికెట్ తీసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్ల ముఖాల్లో కనిపించిన చిరునవ్వు ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే 3వ స్థానంలో ఆడేందుకు వచ్చిన ధోనీ వారిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. పిచ్ స్థితిని గ్రహించి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత గేర్ మార్చి బౌలర్ ఎవరనేది చూడకుండా ఉతికారేశాడు.

ఇవి కూడా చదవండి

ధోని తుఫాన్ ఇన్నింగ్స్ ఇదే..

31 అక్టోబర్ 2005న భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ దెబ్బ రుచి చూడని బౌలర్ లేడు. మైదానం మధ్యలో నిలబడి సెంచరీ చేయడమే కాకుండా తన వన్డే కెరీర్‌లోనే అతిపెద్ద స్కోర్‌ను నమోదు చేసి, తుఫాను సృష్టించాడు. ఆ రోజు ధోని 145 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, 15 ఫోర్లతో అజేయంగా 183 పరుగులు చేశాడు.

లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అతిపెద్ద ఇన్నింగ్స్‌..

శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ధోనీ తన డేంజరస్ ఇన్నింగ్స్‌కు స్క్రిప్ట్‌ను రాసుకున్నాడు. దాని ప్రతిధ్వని 18 ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతుంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. శ్రీలంక తరపున కూడా కుమార సంగక్కర 138 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ను సాధించాడు.

లంకపై 183* పరుగుల ఇన్నింగ్స్..

కానీ, శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ చేసిన సెంచరీకి స్పందించిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అంటే ఎంఎస్ ధోనీ. సెంచరీ చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని అజేయంగా 183 పరుగులతో ఆకట్టుకున్నాడు. 18 సంవత్సరాల క్రితం ఆడిన మ్యాచ్‌లో టీమిండియా ధోనీ ఇన్నింగ్స్ కారణంగా 6 వికెట్లు, 23 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!