Watch Video: వామ్మో.. బౌలరే అనుకుంటే.. బ్యాటర్ కూడానా.. క్రికెట్ చరిత్రలోనే ఫన్నీ మూమెంట్ ఇదే.. వైరల్
Funny Video: బాల్ వేసేందుకు సిద్ధమైన బౌలర్.. రన్‌అప్‌తో వచ్చి నేరుగా బ్యాట్స్‌మన్ వైపు బంతిని విసిరేస్తాడు. కానీ, బంతి బ్యాటర్ వైపు కాకుండా.. గాలిలో ఎత్తుగా ఎగిరింది. బంతి పైకి వెళ్లడం చూసి, బ్యాట్స్‌మన్ పిచ్‌పై బంతి వైపు ముందుకు కదిలి, బంతి నేలపై పడగానే చాలా వేగంగా షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, షాట్ కొట్టే ప్రయత్నంలో నాన్-స్ట్రైకర్ బ్యాట్స్‌మన్‌కు హెల్మెట్‌కు బలంగా తగిలి ఆఫ్ సైడ్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ పరుగులు తీశారు. దీంతో ఈ వీడియో చాలా ఫన్నీగా మారింది.

Funny Video: ప్రస్తుతం క్రికెట్‌లో అతిపెద్ద టోర్నమెంట్ వన్డే ప్రపంచ కప్ 2023, భారత గడ్డపై జరుగుతోంది. ఈ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్ చేరే టీంలపై ఆసక్తి నెలకొంది. కాగా, సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్రికెట్ చరిత్రలోనే హాస్యాస్పదమైన సీన్ కనిపించింది. ఫన్నీ బాల్‌తో పాటు, ఫన్నీ షాట్‌ను చూడొచ్చు. ఈ వీడియోలో బ్యాట్స్‌మన్ తన షాట్‌తో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేశాడు.
బాల్ వేసేందుకు సిద్ధమైన బౌలర్.. రన్‌అప్‌తో వచ్చి నేరుగా బ్యాట్స్‌మన్ వైపు బంతిని విసిరేస్తాడు. కానీ, బంతి బ్యాటర్ వైపు కాకుండా.. గాలిలో ఎత్తుగా ఎగిరింది. బంతి పైకి వెళ్లడం చూసి, బ్యాట్స్‌మన్ పిచ్‌పై బంతి వైపు ముందుకు కదిలి, బంతి నేలపై పడగానే చాలా వేగంగా షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, షాట్ కొట్టే ప్రయత్నంలో నాన్-స్ట్రైకర్ బ్యాట్స్‌మన్‌కు హెల్మెట్‌కు బలంగా తగిలి ఆఫ్ సైడ్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ పరుగులు తీశారు. దీంతో ఈ వీడియో చాలా ఫన్నీగా మారింది.
వైరల్ వీడియో..
Oh my word 😂
via @PlayCricketAU pic.twitter.com/4uoGAg68ez
— Village Cricket Moments (@villagemoments) October 30, 2023
కాగా, క్రికెట్ వరల్డ్ కప్ 2023లో టీమిండియా అద్భుతమైన ఫామ్‌తో దూసుకపోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి, అన్నింటిలోనూ విజయం సాధించింది. 6 విజయాలు సాధించిన టీమిండియా ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరొక మ్యాచ్ గెలిస్తే.. సెమీ ఫైనల్ చేరుకుంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








