AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Pragathi: రెండో పెళ్లి వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నటి ప్రగతి.. ఆ రాతలపై తీవ్ర ఆగ్రహం

గతేడాది డీజే టిల్లు, ఎఫ్‌ 3, గాడ్‌ ఫాదర్‌, స్వాతిముత్యం వంటి హిట్ సినిమాల్లో నటించిన ప్రగతి ఇటీవల చిరంజీవి నటించిన భోళా శంకర్‌ సినిమాలోనూ కనిపించారు. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోన్న ప్రగతి తన ఫిట్‌నెస్‌, వర్కవుట్ వీడియోలను అందులో షేర్‌ చేస్తుంటారు.

Actress Pragathi: రెండో పెళ్లి వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నటి ప్రగతి.. ఆ రాతలపై తీవ్ర ఆగ్రహం
Actress Pragathi
Basha Shek
|

Updated on: Oct 30, 2023 | 1:59 PM

Share

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీగా ఉంటోన్న నటీమణుల్లో ప్రగతి ఒకరు. తెలుగుతో పాటు తమిళ్‌,క న్నడ సినిమాల్లో అమ్మ, వదిన తరహా పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది డీజే టిల్లు, ఎఫ్‌ 3, గాడ్‌ ఫాదర్‌, స్వాతిముత్యం వంటి హిట్ సినిమాల్లో నటించిన ప్రగతి ఇటీవల చిరంజీవి నటించిన భోళా శంకర్‌ సినిమాలోనూ కనిపించారు. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోన్న ప్రగతి తన ఫిట్‌నెస్‌, వర్కవుట్ వీడియోలను అందులో షేర్‌ చేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రగతి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ ప్రముఖ నిర్మాతతో కలిసి మళ్లీ పెళ్లీపీటలెక్కనుందంటూ పలు వెబ్ సైట్లు కథనాలు కూడా ప్రచురించాయి. తాజాగా ఈ వార్తలపై ప్రగతి స్పందించారు. సినిమా నటి అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారామె. నేను రెండోసారి వివాహం చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి. వీటిని చూడగానే మనసుకు ఎంతో బాధగా అనిపించింది. ఆధారాలు లేకుండా ఇలా ఇలాంటి వార్తలు రాయడం బాధ్యతా రాహిత్యం. నేను సినిమా నటిని కాబట్టి మీరు ఏమైనా రాయవచ్చని అనుకుంటే అది కచ్చితంగా తప్పే అవుతుంది. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డానికి ఎవరికీ ఎలాంటి హక్కులేదు. ఇలాంటి విషయాల్లో కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తించండి’ అని చెప్పుకొచ్చారు ప్రగతి. తద్వారా తన రెండో పెళ్లిపై వస్తోన్న వార్తలన్నీ రూమర్లేనంటూ కుండ బద్దలు కొట్టేశారామె.

కాగా ప్రగతి ప్రస్తుతం సింగిల్ మదర్‌ గానే కొనసాగుతున్నారు. భర్తతో విడిపోయి విడాకులు తీసుకున్న ఆమె తన కూతురుతో కలిసి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. ఈసారి ఈ రూమర్లు మరింత ఎక్కువ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారామె. కాగా భోళా శంకర్‌లో మెరిసిన ప్రగతి ప్రస్తుతం రామ్ పోతినేని డబుల్‌ ఇస్టార్మ్‌ సినిమాలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

నటి ప్రగతి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..