AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో మార్మోగుతోన్న రజనీకాంత్ పేరు! ఇంతకీ విషయమేమిటంటే?

తెలంగాణ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజకీకాంత్ పేరు మార్మోగుతోంది. అన్ని పార్టీల నాయకులు ఆయన పేరునే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తలైవా పేరు హోరెత్తుతోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌.. ఇలా ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ చూసినా రజనీకాంత్‌ పాటే వినిపిస్తోంది.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో మార్మోగుతోన్న రజనీకాంత్ పేరు! ఇంతకీ విషయమేమిటంటే?
Telangana Elections
TV9 Telugu
| Edited By: Basha Shek|

Updated on: Oct 30, 2023 | 1:41 PM

Share

తెలంగాణ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజకీకాంత్ పేరు మార్మోగుతోంది. అన్ని పార్టీల నాయకులు ఆయన పేరునే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తలైవా పేరు హోరెత్తుతోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌.. ఇలా ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ చూసినా రజనీకాంత్‌ పాటే వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. సోషల్ మీడియాలో అన్ని పార్టీల కార్యకర్తలు తమ పార్టీని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. తమ నాయకులను ఎలివేట్‌ చేసే పనిలోనూ.. అలాగే ఇతర పార్టీలను విమర్శించే ఆక్టివిటీలోనూ బిజీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో తమ నాయకుల వీడియోలకు మంచి మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో పెడుతూ కార్యకర్తలు జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో విడుదలైన జైలర్ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్ని పార్టీల కార్యకర్తలకు సోషల్ మీడియా వారియర్లకు పెద్ద అస్త్రంగా మారింది. జైలర్ సినిమాలో  ఎలివేషన్ మ్యూజిక్ ఆ సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాల కు ఫేస్ మార్కింగ్ లు చేసి పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. జైలర్‌ మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను అన్ని పార్టీల సోషల్ మీడియా వారియర్లు ట్విట్టర్ ఫేస్బుక్ వేదికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీలోని అభిమాన నాయకులైన కేసీఆర్ రేవంత్ కేటీఆర్ హరీష్, ఈటెల రాజేందర్ బండి సంజయ్ కిషన్ రెడ్డి వంటి నాయకులకు విజువల్స్ కు జైలర్ మ్యూజిక్ జతపరుస్తూ వాళ్ళ కార్యకర్తల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తున్నారు. దీంతో రాజకీయ టైమ్ లైన్ మొత్తం జైలర్ మ్యూజిక్ వినిపిస్తూనే ఉంది.

గతంలో రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర కర్ణాటకలో ప్రవేశించినప్పుడు పెద్ద ఎత్తున కేజీఎఫ్ కి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ను వాడుకున్నారు. అయితే ఆ మ్యూజిక్ రైట్స్ ఓన్ చేసుకున్న కంపెనీ ఈ విషయాన్ని తప్పు పడుతూ కోర్టు మెట్లు కూడా ఎక్కింది . వెంటనే కోర్టు కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్స్ లో వచ్చిన కేజిఎఫ్ మ్యూజిక్ వీడియోస్ తొలగించమని ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు జైలర్‌ బీజీఎమ్‌ ను యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. అయితే జైలర్ music రైట్స్ ఉన్న సదరు మీడియా కంపెనీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుందని చర్చ కూడా నడుస్తుంది. ఒకవేళ ఆ కంపెనీ తేరుకుని.. ఇకనుంచి మ్యూజిక్ వాడకూడదని సోషల్ మీడియా వేదికలకు ఫిర్యాదు చేసిన వాళ్లు చర్యలు తీసుకునే లోపు ఎన్నికలు పూర్తవుతాయి. మొత్తానికి జైలర్ సినిమా థియేటర్ లో నుంచి వెళ్ళినప్పటికీ కూడా రాజకీయ నాయకుల పుణ్యమా అంటూ ఆ మ్యూజిక్‌ ప్రేక్షకులు మళ్లీ మళ్లీ వింటూనే ఉన్నారు. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ అందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇవి కూడా చదవండి