AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: నగదు తరలించేందుకు నేతల నక్కజిత్తులు.. వారిని ఆశ్రయిస్తున్న పొలిటికల్ లీడర్స్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ఊపందుకుంటోంది. ఈ ప్రతిష్ఠాత్మక ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన కొంత మంది అభ్యర్థులు అసలు సరంజామా పై నజర్ పెట్టారట. ఎన్నికలు అంటేనే ఖర్చులు కాబట్టి  వాటి సమీకరణ పై ఫోకస్ పెట్టారట కొంత మంది అభ్యర్థులు.

Telangana Elections: నగదు తరలించేందుకు నేతల నక్కజిత్తులు.. వారిని ఆశ్రయిస్తున్న పొలిటికల్ లీడర్స్
cash bundles (Representative Image)
Sridhar Prasad
| Edited By: Basha Shek|

Updated on: Oct 30, 2023 | 1:03 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. దీంతో కొంత మంది రాజకీయ నాయకులు హవాలా డీలర్ల కోసం ఆరా తీస్తున్నారు? ఎన్నికల సమయంలో నగదు తరలింపు సునాయాసంగా జరగలంటే హవాలా డీలర్లు సాయం తప్పదని కొంత మంది నేతలు అనుకుంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ఊపందుకుంటోంది. ఈ ప్రతిష్ఠాత్మక ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన కొంత మంది అభ్యర్థులు అసలు సరంజామా పై నజర్ పెట్టారట. ఎన్నికలు అంటేనే ఖర్చులు కాబట్టి  వాటి సమీకరణ పై ఫోకస్ పెట్టారట కొంత మంది అభ్యర్థులు. అయితే ఇప్పటికే నగదు తరలింపును కట్టడి చేయడం పై దృష్టి పెట్టిన ఈసీ ఆ దిశగా కటీన చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సేఫ్ గా నగదు తరలించడంపై రాజకీయ నాయకులు ఫోకస్ పెట్టారట. అందు కోసం హవాలా ఆపరేటర్ల సమాచారం కోసం ఆరా తీసే పనిలో ఉన్నారట కొంత మంది రాజకీయ నేతలు. రాబోయే రోజుల్లో పోలీసుల తనిఖీలు మరింత ముమ్మరంగా ఉండడంతో నగదు తరలింపు అంత సులువు కాదు అన్న అంచనాకు వచ్చారట కొంత మంది నేతలు.ఇందు కోసం వారు నమ్మకమైన హవాలా డీలర్ల కోసం వేట మొదలు పెట్టారట మామూలు సమయంలోనే హవాలా డీలర్లకు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో వారికి డిమాండ్ మరింత పెరిగిందన్న గుస గుసలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. హవాలా డీలర్లు తమకు ఉన్న నెట్ వర్క్ తో ఈజీగా డబ్బులు అందేలా చూస్తామని తమకు టచ్ లోకి వస్తున్న పొలిటీషియన్స్ కు గ్యారెంటీ ఇస్తున్నారట. మరి గ్రామీణ ప్రాంతాలకు అయితే నగదును చేర్చలేమని హవాలా డీలర్లు చెబుతున్నారట. ఒక కోటి రూపాయలు నగదు అందిస్తే కొంత మంది మూడు శాతం కమిషన్ అడుగుతున్నారట. ఇక మరికొంత మంది హవాలా డీలర్లు 1.5 శాతం నుంచి 2.5 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారట.

ఇక కోటి రూపాయల పైనే అమౌంట్ ఉంటే.. హవాలా డీలర్లు కమిషన్ ను తగ్గిస్తున్నరట. ఈ ఎన్నికల సమయంలో గరిష్టంగా 10 కోట్ల రూపాయల వరకు నగదును అప్పగించేందుకు హవాలా డీలర్లు సముఖత వ్యక్తం చేస్తున్నారట. ఇక నగదు తరలింపు సమయంలో తేడా వస్తే రిస్క్ కూడా మాదే అన్న భరోసాను నేతలకు ఇస్తున్నారట హవాలా డీలర్లు. మరోవైపు ఎన్నికల సమయం లో అక్రమ నగదు తరలింపును అడ్డుకట్ట వేసేందుకు ఈసీ ఇప్పటికే కటిన చర్యలు తీసుకుంటుంది.దాదాపు 20 ఏజెన్సీల ను రంగంలోకి దింపింది ఈసీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..